కట్టెలు కొట్టే వ్యక్తి కూతురికి ఎంబీబీఎస్ సీటు
శివగంగలో కట్టెలు కొట్టే వ్యక్తి కూతురు మెడికల్ సీటు సాధించింది. శివగంగ సమీపంలోని కాయంగుళం కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్, కాళీముత్తుల పెద్ద కుమార్తె ఎస్.స్నేహ.
- By Hashtag U Published Date - 10:46 AM, Mon - 31 January 22
శివగంగలో కట్టెలు కొట్టే వ్యక్తి కూతురు మెడికల్ సీటు సాధించింది. శివగంగ సమీపంలోని కాయంగుళం కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్, కాళీముత్తుల పెద్ద కుమార్తె ఎస్.స్నేహ. ఈమెకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆమె తల్లి కాళీముత్తు మహాతమా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈమె తండ్రి కట్టేలు కొడుతూ జీవనం సాగిస్తున్నారు.అయితే తన కూతుర్ని కష్టపడి చదివించారు. నీట్ కోచింగ్ కి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి స్నేహ ఇంటి నుండి నీట్‌కు సిద్ధమై 199 మార్కులు సాధించింది. కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5% కోటా కింద కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. నీట్‌కు భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి కష్టపడి చదివితే వైద్య కళాశాల సీటు సాధించవచ్చని స్నేహ తెలిపారు.
Related News
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.