Arunachalam : అరుణాచలంలో తెలుగు యాత్రికురాలిను అత్యాచారం చేసిన కానిస్టేబుళ్లు
Arunachalam : తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని అరుణాచలం(Arunachalam )లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారం (Rape by two police constables) చేసిన ఘటన రాష్ట్రాలను కుదిపేసింది
- By Sudheer Published Date - 08:15 PM, Tue - 30 September 25

తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని అరుణాచలం(Arunachalam )లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారం (Rape by two police constables) చేసిన ఘటన రాష్ట్రాలను కుదిపేసింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు, డ్రైవర్‌తో కలిసి వాహనంలో ప్రయాణిస్తుండగా, తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్‌రాజ్‌లు వాహనాన్ని ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. ఆ సమయంలో యువతి లక్ష్మిపై దృష్టి పెట్టి, ఆమె వద్ద అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ కొట్టి, సమీపంలోని పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడే వదిలేసి పరారయ్యారు.
Jubilee Hills Byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్
తెల్లవారుజామున గ్రామస్థులు బాధితురాలిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సతీష్ బాధితురాలిని ఆసుపత్రిలోనే పరామర్శించి వివరాలు సేకరించారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ఘటనాస్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రేపిస్టులు పోలీసులే కావడంతో జిల్లా అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు సహా పది మందికి పైగా ఉన్నతాధికారులు మోహరించబడ్డారు. అరెస్టు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఈ మధ్య అరుణాచలంలో తెలుగు భక్తులపై దాడులు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వైపు తరలిపోతుండటంతో, కొంతమంది స్థానికులు తెలుగు యాత్రికులపై వ్యతిరేకత చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా పోలీసులే అత్యాచారానికి పాల్పడటం భయాందోళనలకు దారితీస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత దారుణం మాత్రమే కాకుండా, యాత్రికుల భద్రతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. యాత్రికులు భద్రతగా దర్శనం చేసుకునే విధంగా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల రక్షణకు ప్రత్యేక పహారా, కఠిన పర్యవేక్షణ అవసరమని ప్రజలు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.