HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Chennais Amrutha Signs Agreement With Malaysian University

University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

ఏవియేషన్ రంగంలో గ్లోబల్ పాస్‌పోర్ట్‌గా భావించే ఐఏటీఏ (IATA) సర్టిఫికేషన్ శిక్షణను చెన్నైస్ అమృత తన విద్యార్థులకు ఉచితంగా అందించడం విశేషం.

  • Author : Sudheer Date : 08-04-2026 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chennai's Amrutha Signs Agr
Chennai's Amrutha Signs Agr

భారతదేశంలోని ప్రముఖ విమానయాన శిక్షణా సంస్థ ‘చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్’, విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేస్తోంది. మలేషియా వర్సిటీతో చేతులు కలిపిన చెన్నైస్ అమృత విమానయాన రంగంలో గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను విద్యార్థుల ముంగిటకే తీసుకురావడానికి చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్, యూనికామ్ (UniCAM) మలేషియాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చెన్నైలో ఏప్రిల్ 8, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు మలేషియా నిపుణుల సమక్షంలో శిక్షణ పొందడమే కాకుండా, ఏవియేషన్ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విమానాశ్రయ కార్యకలాపాలు వంటి ఆధునిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లలో పాల్గొనే అవకాశం లభించనుంది.

దక్షిణాది నుండి న్యూఢిల్లీ వరకు

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న చెన్నైస్ అమృత, ఇప్పుడు తన కార్యకలాపాలను దేశ రాజధాని న్యూఢిల్లీకి విస్తరిస్తోంది. 2035 నాటికి విమానయాన రంగంలో దాదాపు 2 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఈ సంస్థ విద్యార్థులను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు మొదటి రెండేళ్లు చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకుని, చివరి ఏడాదిలో మలేషియాలో ఆరు నెలల అకడమిక్ శిక్షణ మరియు ఆరు నెలల పాటు అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పించారు.

ఉచిత IATA శిక్షణ.. విద్యార్థులకు అదనపు ఊతం

ఏవియేషన్ రంగంలో గ్లోబల్ పాస్‌పోర్ట్‌గా భావించే ఐఏటీఏ (IATA) సర్టిఫికేషన్ శిక్షణను చెన్నైస్ అమృత తన విద్యార్థులకు ఉచితంగా అందించడం విశేషం. సాధారణంగా ఇతర సంస్థల్లో రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శిక్షణను, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ పర్యవేక్షణలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ అనుభవం కోసం విద్యా రుణ సహాయం, చదువుకుంటూ సంపాదించుకునే (Part-time jobs) అవకాశం మరియు ప్లేస్‌మెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఈ సంస్థ విమానయాన విద్యలో తనదైన ముద్ర వేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aviation Training MOU
  • Chennais Amirta Aviation College
  • International Internship
  • UniCAM Malaysia

Related News

    Latest News

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd