Older man Relationship: పనిమనిషితో సెక్స్ చేస్తుండగా వృద్ధుడి మృతి!
బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది.
- By Balu J Published Date - 02:12 PM, Fri - 25 November 22
బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది. మృతిపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆయన తన ఇంటి పనిమనిషితో సెక్స్ చేస్తున్నప్పుడు మరణించాడని తేలిందని పోలీసులు తెలిపారు. ప్రేమికురాలైన ఇంటి పనిమనిషి ఆమె భర్త, సోదరుడి సహాయంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని బెడ్‌షీట్, ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడతామన్న భయంతోనే రోడ్డు పక్కన పడేశామని నిందితులు అంగీకరించారు. పోలీసు వివరాల ప్రకారం.. జె.పి.నగర్‌కు చెందిన బాలసుబ్రమణ్యం మృతదేహాన్ని నవంబర్ 17న రోడ్డు పక్కనే స్వాధీనం చేసుకున్నారు.
ఆయన తన మనవడితో కలిసి బయటకు వెళ్లాడు. అతడిని బ్యాడ్మింటన్ క్లాస్‌కి దింపిన తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కనిపించడం లేదని సుబ్రమణ్యనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కదలికలను ట్రాక్ చేయగా అతను తన ప్రియురాలి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. సెక్స్‌లో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో గుండెపోటుతో చనిపోయాడు. బాధితుడికి గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags
Related News
Hyderabad: 4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
Hyderabad: సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ SOT మదాపూర్ టీం కాటూరి సూర్య కుమార్, గుత్తుల శ్యామ్ బాబు పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని, 2 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2017లో ఉన్నత చదు�