HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Amit Shah Pitches For A Tamil Pm

Tamil PM: రాజకీయ మైలేజ్ కోసమే ‘తమిళ ప్రధాని’ తెరపైకి?

తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పర్యటనలో భాగం అమిత్ షా మాట్లాడుతూ.

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2023 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Abolish Muslim Reservation If Comes To Power.. Amit Shah Sensational Announcement

Tamil PM: తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తమిళుడే భారత ప్రధాని కావాలని సంచలన కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షా ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

తమిళనాడు పర్యటనలో అమిత్ షా రెండు రోజుల పాటు పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దివంగత నేత ఎం. కరుణానిధిపై విమర్శలు గుప్పించిన షా, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె. కామరాజ్, జి.కె. మూపనార్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. కరుణానిధి వారి అవకాశాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో అమిత్ షా కాంగ్రెస్-డీఎంకే కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబంలోని మూడు తరాలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రతిష్టను పెంచిందని, అయితే ఈ రెండు పార్టీలు తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు పనిచేశాయని ఆరోపించారు.

ఇదిలా ఉండగా అమిత్ షా రాజకీయ లబ్ది పొందేందుకే తమిళ ప్రధాని ఇష్యూ లేవనెత్తారని అంటున్నారు డీఎంకే నేతలు. ఇది డీఎంకేను కార్నర్ చేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. నిజానికి తమిళనాడుతో పాటు పుదుచ్చేరి నుంచి మొత్తం 39 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని డీఎంకే ఇటీవలే ప్రకటించింది. ఈ సమయంలో అమిత్ షా చేసిన ‘తమిళ ప్రధాని’ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.

#WATCH | Tamil Nadu | In Vellore, Union Home Minister Amit Shah says, "Tamil Nadu had Congress-DMK government for 10 years. That government indulged in Rs 12,000 crores of corruption & scams. In 9 years, nobody has levelled even one allegation of corruption against the Modi… pic.twitter.com/dfGjGM6MVy

— ANI (@ANI) June 11, 2023

కాంగ్రెస్ మరియు డిఎంకె 2G, 3G మరియు 4G పార్టీలుగా అభివర్ణించారు. నేను 2G స్కామ్ గురించి మాట్లాడటం లేదు… ఇక్కడ 2G అంటే 2 తరాలు, 3G అంటే 3 తరాలు, 4G అంటే 4 తరాలుగా విభజిస్తూ వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. మురసోలి మారన్ కుటుంబం 2G అని వారి కుటుంబం రెండు తరాలుగా అవినీతిలో కూరుకుపోయిందని, కరుణానిధి కుటుంబం 3జీ అని వాళ్ళ కుటుంబం మూడు తరాలు అవినీతిలో కూరుకుపోయాయని.. గాంధీ కుటుంబం 4జీ అని, రాహుల్ గాంధీ 4వ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని హాట్ కామెంట్స్ కు పాల్పడ్డారు షా.

Read More: 2 Lakh Crores : 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం పగ్గాలు నాలుగో కొడుకుకు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • CM Stalin
  • congress
  • dmk
  • Karunanidhi
  • Tamil PM
  • Tamilanadu Politics

Related News

Vijayasai Reddy's Sensational Tweet on Tamil Nadu Politics

Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a […]

  • Vijay TVK

    Cm Vijay: ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM: కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

  • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

  • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

  • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd