Delhi : ఢిల్లీలో దారుణం.. డి – అడిక్షన్ సెంటర్‌లో వ్యక్తిపై దాడి
ఈశాన్య ఢిల్లీలోని సోనియా విహార్ ప్రాంతంలోని డి-అడిక్షన్ సెంటర్‌లో 32 ఏళ్ల వ్యక్తి దాడికి గురై మరణించాడని పోలీసులు
- By Prasad Published Date - 06:40 AM, Sun - 4 June 23

ఈశాన్య ఢిల్లీలోని సోనియా విహార్ ప్రాంతంలోని డి-అడిక్షన్ సెంటర్‌లో 32 ఏళ్ల వ్యక్తి దాడికి గురై మరణించాడని పోలీసులు తెలిపారు. సంఘటన గురించి ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి నుండి సమాచారం అందిందని, బాధితుడిని మోతీ నగర్‌లోని సుదర్శన్ పార్క్ నివాసి అనిల్ కుమార్‌గా గుర్తించామని వారు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి కుడి కన్ను కింద కోత, శరీరంపై నీలిరంగు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుమార్‌ను సోనియా విహార్‌లోని ఏ-33 చౌహాన్ పట్టిలోని డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్చారు. ఈ కేంద్రంలో ఫ్లోర్ ఇన్‌చార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కుమార్ అభినయ్‌ను కర్రతో కొట్టడం ప్రారంభించాడని.. దీంతో ఇతర ఖైదీలు కోపోద్రిక్తులైయ్యారని పోలీసులు వెల్లడించారు. కుమార్‌కు సిబ్బంది పెయిన్ కిల్లర్ ఇచ్చారని.. తెల్లవారుజామున 1 గంటలకు అతని పరిస్థితి క్షీణించిందని తెలిపారు. దీంతో వెంటనే అతన్ని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని తెలిపారు. డి-అడిక్షన్ సెంటర్‌లోని ఇతర ఖైదీలపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.