Chennai Airshow: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో ముగ్గురి మృతి.. తొక్కిసలాట కారణమా..?
భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అతి పొడవైన బీచ్‌లలో ఒకటైన మెరీనా బీచ్‌లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మండే ఎండలో కూడా దాదాపు 15 లక్షల మంది ఉండడంతో మెరీనా బీచ్ కూడా చిన్నబోయింది.
- By Gopichand Published Date - 07:51 AM, Mon - 7 October 24

Chennai Airshow: భారత వైమానిక దళానికి చిరస్మరణీయమైన రోజు ఆదివారం చాలా కుటుంబాలకు బ్లాక్ డేగా మారింది. 92వ IAF దినోత్సవ వేడుకల్లో ఎయిర్ షో (Chennai Airshow) ట్రిక్స్ చూసేందుకు చెన్నైలోని మెరీనా బీచ్‌లో గుమికూడిన జనంలో ఎండ వేడికి చాలా మంది బాధితులయ్యారు. ఎయిర్ షో కోసం ఉదయం 11 గంటల నుంచి మెరీనా బీచ్‌లో దాదాపు 15 లక్షల మంది జనం తరలివచ్చారు. దీంతో అక్కడికి అడుగు పెట్టడం కూడా భారంగా మారడంతో ప్రజలు మరింత వేడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎండవేడిమికి విపరీతంగా చెమటలు పట్టడంతో వందలాది మంది ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటివరకు డీహైడ్రేషన్, తొక్కిసలాటలో ఊపిరాడక ముగ్గురు మరణించారు. సుమారు 225-230 మంది ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అతి పొడవైన బీచ్‌లలో ఒకటైన మెరీనా బీచ్‌లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మండే ఎండలో కూడా దాదాపు 15 లక్షల మంది ఉండడంతో మెరీనా బీచ్ కూడా చిన్నబోయింది. దీంతో ప్రజలు నిలబడేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలకు చెమటలు పట్టి డీహైడ్రేషన్ బారిన పడ్డారు. ఈ క్రమంలో మృతి చెందిన ముగ్గురిని పెరుంగళత్తూరుకు చెందిన శ్రీనివాసన్ (48), తిరువొత్తియూర్‌కు చెందిన కార్తికేయన్ (34), కొరుకుపేటకు చెందిన జాన్ (56)గా గుర్తించారు. ఈ ముగ్గురిలో కనీసం ఒకరు హీట్ స్ట్రోక్ కారణంగా మరణించారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!
షో ప్రారంభంలో స్పెషల్ గరుడ ఫోర్స్ కమాండోలు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మొత్తం 72 విమానాలు కూడా ప్రజల ముందుకు వచ్చాయి. ఇందులో ఫ్రెంచ్ 5వ తరం ఫైటర్ జెట్ రాఫెల్, స్వదేశీ అత్యాధునిక తేలికపాటి యుద్ధ విమానం తేజస్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ, హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా కూడా ఉన్నాయి. భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శన సాధారణంగా దేశంలోని ఉత్తర ప్రాంతంలో నిర్వహించబడుతుంది. అయితే ఈసారి మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్ షో నిర్వహించడం ఇది మూడోసారి. అంతకుముందు 2023 అక్టోబర్‌లో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించగా.. IAF తన ప్రదర్శనను 2022లో చండీగఢ్‌లో నిర్వహించింది.