Tamil Nadu : విద్యార్థికి జ్యూస్‌లో మూత్రం కలిపి తాగించిన తోటి విద్యార్థులు
- Author : Sudheer
Date : 23-01-2024 - 7:59 IST
Published By : Hashtagu Telugu Desk
స్కూల్స్ , కాలేజీలలో విద్యార్థులు రెచ్చిపోతున్నారు..కొంతమంది ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే..మరికొంతమంది కోపం తో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుచిరాపల్లి (Tiruchirappalli )లోని తమిళనాడు (Tamil Nadu) నేషనల్ లా యూనివర్శిటీ (National Law University)లో ఓ విద్యార్థికి మూత్రం (Urine) కలిపిన జ్యూస్ (Juice )తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
లా ఫైనల్ ఇయర్ చదువుతున్న బాధిత విద్యార్థి..రోజుమాదిరిగానే కాలేజీకి వెళ్లగా.. సహవిద్యార్థులు హేళన చేయడం మొదలుపెట్టారు. ఎందుకు ఆలా చేస్తున్నారని..ప్రశ్నించగా..తనకు మూత్రం కలిపిన జ్యూస్ తాగించారనే విషయాన్నీ తెలిపారు. దీంతో సదరు స్టూడెంట్.. వైస్ ఛాన్సలర్ వి. నాగరాజ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న యూనివర్సిటీ యజమాన్యం, ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ఈ ఘటన నిజమని తేలడం తో ఈ ఘటనకు పాల్పడ్డ విద్యార్థులను ప్రస్తుత సంవత్సరంలో 10వ-సెమిస్టర్ పరీక్షలకు హాజరుకాకుండా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రామ్‌జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also : APPSC Group 1 : ఏపీలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు..