APPSC Group 1 : ఏపీలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు..
- Author : Sudheer
Date : 23-01-2024 - 7:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో గ్రూప్-1 (APPSC Group 1)ఉద్యోగాల నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు పెంచింది ఏపీపీఎస్సీ. ముందుగా గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు జనవరి 21తో ముగుస్తుందని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ తేదీని జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు పొడగించింది. దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు ఆన్ లైన్ లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
APPSC Group-1 పోస్టుల వివరాలు చూస్తే..
ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు- 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్- 18, డీఎస్పీ (సివిల్)- 26, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్- 6, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు- 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్- 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు- 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
Read Also :