Old is Gold: 104 వయస్సులోనూ… తగ్గేదేలే…
కేరళ రాష్ట్రం ఇటీవలే అక్షరాస్యత మిషన్ పరీక్షను నిర్వహించింది. ఆ పరీక్షలో 104 ఏండ్ల వృద్ధురాలు కుట్టియయ్య వందకు 89 మార్కులు సాధించింది.
- By Hashtag U Published Date - 10:39 PM, Mon - 15 November 21

కేరళ రాష్ట్రం ఇటీవలే అక్షరాస్యత మిషన్ పరీక్షను నిర్వహించింది. ఆ పరీక్షలో 104 ఏండ్ల వృద్ధురాలు కుట్టియయ్య వందకు 89 మార్కులు సాధించింది. ఈ విషయాన్ని కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి
ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కుట్టియమ్మ ఫొటోను పెట్టి ‘జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వయస్సు అడ్డంకి కాదని,అత్యంత గౌరవం, ప్రేమతో కుట్టియమ్మకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
కుట్టియమ్మ చిన్నప్పుడు బడికి వెళ్లలేకపోవడంతో చదువుకోలేకపోయింది. కేరళ ప్రభుత్వం చేపట్టిన సాక్షరత ప్రేరక్ రెహనా కార్యక్రమంతో చదవడం, రాయడం నేర్చుకున్నది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటిలోనే తరగతులకు హాజరైన కుట్టియమ్మ ప్రస్తుతం నాల్గవ తరగతి పరీక్ష రాయడానికి అర్హత పొందింది.
Also Read: కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
కొట్టాయంలోని అయర్కున్నం పంచాయతీలో నిర్వహించిన సాక్షరత పరీక్షకు హాజరైన కుట్టియమ్మ పరీక్ష సమయంలో తనకు వినికిడి సమస్య ఉన్నదని, తనకోసం సూచనలను గట్టిగా చదవాలని ఇన్విజిలేటర్‌ను రిక్వెస్ట్ చేసిందట.
104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9
— V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021
పరీక్షలో కుట్టియమ్మ వందకు 89 మార్కులు సాధించిన విషయం వైరల్ కావడంతో తానిప్పుడు సెలెబ్రెటీ అయ్యింది. ఇటు సోషల్ మీడియాలో సైతం కుట్టియమ్మ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పరీక్షల్లో ఫెయిలై ఎందుకు పనికిరారని అనుకునేవారు కుట్టియమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.
Related News

Google Maps: ఇద్దరి వైద్యుల ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్.. అసలేం జరిగిందంటే..?
టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే అది మీ ప్రాణాలను కూడా తీయగలదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) తప్పుదారి పట్టించడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంటుంది.