Kangana Controversy: కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ఇండియాకి 1947లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని, నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
- By Hashtag U Published Date - 10:17 PM, Mon - 15 November 21

ఇండియాకి 1947లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని, నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కేంద్రం తనకిచ్చిన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయాలని కంగనాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంగనా వాఖ్యలపై స్పందించారు. యూపీలోనిఅలీగఢ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న అసద్ కంగన పేరు ప్రస్తావించకుండ ఇటీవలే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఒక మేడం చేసిన వ్యాఖ్యలు ఒక ముస్లిం చేసి ఉంటే దేశద్రోహం కేసుపెట్టి, మొదట మోకాళ్లపై కాల్పులు జరిపి, తర్వాత జైలుకు పంపేవారని అసద్ విమర్శించారు.
A "mohtarma" received the highest civilian award. In an interview she said India got independence in 2014. Had a Muslim said what she said, UAPA would have been slapped on him and sent to jail after encounter: AIMIM chief Asaduddin Owaisi in Aligarh pic.twitter.com/u7hwyXldWC
— Piyush Rai (@Benarasiyaa) November 14, 2021
Also Read: గంజాయి వ్యాపారులపై పోలీసుల యుద్ధం
ఇటీవల జరిగిన భారత్,పాక్ టీ20 మ్యాచ్ అనంతరం పాక్ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కింద కేసులు పెడుతామని హెచ్చరించిన ప్రభుత్వం, దేశ స్వాతంత్ర్యాన్ని హేళన చేసిన వారిపై
దేశద్రోహం అభియోగాలు మోపుతారా అని అసద్ ప్రశ్నించారు . దేశద్రోహం కేసులు కేసులు కేవలం ముస్లింలపై మాత్రమే పెడుతారా అని అసద్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read: తన మంత్రులందరినీ ఎనిమిది గ్రూపులుగా విడగొట్టిన మోదీ
దేశానికి 2014లో స్వాతంత్య్రం వచ్చిందా? 1947లో వచ్చిందా? మోదీ,యోగీ చెప్పాలని అసద్ ప్రశ్నించారు.
Related News

Telangana Polls 2023 : రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ – అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అని , తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని