Sound Party Movie Review : సౌండ్ పార్టీ మూవీ రివ్యూ.. నవ్వులతో ఫుల్ గా సౌండ్ చేసేయొచ్చు..
- By News Desk Published Date - 12:23 PM, Fri - 24 November 23

నటీనటులు : VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ, ప్రియ, రేఖ, మాణిక్ రెడ్డి, సప్తగిరి, పృథ్వి..
సంగీతం : మోహిత్ రహమాణిక్
సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి
నిర్మాత : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : సంజయ్ శేరి
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు VJ సన్నీ(VJ Sunny) హీరోగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’ నేడు నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ :
డాలర్ కుమార్(VJ సన్నీ), కుబేర్ కుమార్(శివన్నారాయణ) తండ్రి కొడుకులు. వాళ్ళ ఫ్యామిలీ దరిద్రం పోగొట్టి డబ్బులు సంపాదించి ఎలా రిచ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. మరో వైపు డాలర్ కుమార్ సిరి(హ్రితిక శ్రీనివాస్)తో ప్రేమాయణం నడిపిస్తుంటాడు. తండ్రీకొడుకులు అప్పు చేసి ఓ హోటల్ బిజినెస్ మొదలుపెట్టినా అది మూతపడుతుంది. అప్పుల్లో ఉండి డబ్బుల కోసం చూస్తున్నప్పుడు ఓ దొంగతనం కేసు ఒప్పుకుంటే రెండు కోట్లు ఇస్తామని చెప్పడంతో ఒప్పుకుంటారు. కానీ కోర్టులో ఉరిశిక్ష వేశాక తాము ఇరుక్కుంది రేప్ కేసులో అని అర్ధమవుతుంది. దీంతో ఆ కేసు నుండి తండ్రి కొడుకులు ఎలా బయటకి వచ్చారు? హీరో – హీరోయిన్ ల ప్రేమ ఏమైంది? రేప్ చేసిన వాళ్ళు ఎవరు? మధ్యలో బిట్ కాయిన్స్ గొడవేంటి అనేది తెరపై చూడాల్సిందే.
కథనం – విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి కొడుకులు డబ్బులు సంపాదించాలని చేసే ప్రయత్నాలు, హోటల్ బిజినెస్, హీరో – హీరోయిన్స్ మధ్య కొన్ని సన్నివేశాలతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ గా నవ్వుకుంటాము. తండ్రీకొడుకులు జైలు నుంచి బయటపడే సీన్స్, బిట్ కాయిన్స్ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. లాజిక్ లెస్ సీన్స్ ఎన్ని ఉన్నా అన్ని కామెడీతో నవ్వించేశారు. మొదటి నుంచి కూడా ఇది కేవలం కామెడీ సినిమా అని చెప్తూ ప్రమోట్ చేసిన మూవీ యూనిట్ సినిమాలో అదే చూపించారు.
నటీనటులు :
శివన్నారాయణ, VJ సన్నీ తండ్రీకొడుకులుగా కామెడీతో మెప్పించారు. సప్తగిరి జైలర్ గా ఇంప్రెస్ చేస్తాడు. ప్రియ, రేఖ, మాణిక్ రెడ్డి, పృథ్వి తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక అంశాలు :
కామెడీ సినిమాకు తగ్గట్టు BGM బాగా ఇచ్చారు. ఉన్న రెండు సాంగ్స్ వినడానికి బాగానే ఉన్నాయి. కెమెరా విజువల్స్ కూడా రిచ్ గానే కన్పిస్తాయి. సినిమాలో చాలా శాతం బోధన్, పరిసర ప్రాంతాల్లో రియల్ లొకేషన్ లోనే షూట్ చేశారు..
మొత్తంగా ఓ రెండు గంటలు ఏమి ఆలోచించకుండా నవ్వుకోవడానికి థియేటర్ కి వెళ్లాలంటే సౌండ్ పార్టీ సినిమాకు వెళ్లి నవ్వులతో సౌండ్ చేసి రావొచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ & రేటింగ్ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..