Vidudala 2 Review & Rating : విడుదల 2 : రివ్యూ
- By Ramesh Published Date - 06:28 PM, Fri - 20 December 24

Vidudala 2 Review & Rating తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. తను చెప్పే సామాజిక అంశాలు, ఇన్ ఈక్వాలిటీ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. హృదయానికి టచ్ చేసే కథాశాలతో పాటు అందుకు తగినట్టుగా కథనం అందిస్తూ వెట్రిమారన్ చేసే మ్యాజిక్ అందరికీ తెలిసిందే. 2023 లో విడుదల 1 తో మరోసారి తన మార్క్ చాటి చెప్పిన వెట్రిమారన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా విడుదల 2 సినిమాతో వచ్చాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
విడుదల 1 చివర్లోనే మాస్టర్ అలియాస్ పెరుమాళ్ (విజయ్ సేతుపతి) ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా కస్టడీలో ఉన్న పెరుమాళ్ ని పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా రెండో పార్ట్ మొదలవుతుంది. ఐతే అతను పోలీసు కస్టడీలో ఉన్న విషయం బయటకు రావడంతొ అతన్ని మరో క్యాంప్ కి షిఫ్ట్ చేస్తారు. అక్కడే పెరుమాళ్ ని ఎన్ కౌంటర్ చేయాలని ప్లాన్ వేస్తారు. ఆ టైం లోనే పోలీసులకు పెరుగాళ్ తన కథ చెప్పడం మొదలు పెడతాడు. స్కూల్ మాస్టర్ గా ఉన్న కరుప్పన్ పెరుమాళ్ గా ఎలా మారాడు..? తన జీవితంలో జరిగిన మార్పులు ఏంటి../ మహాలక్ష్మి పెరుమాళ్ జీవితంలోకి ఎలా వచ్చింది..? పెరుమాళ్ కథ విన్న పోలీసులు ఏం చేశారు..? పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడా అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
వెట్రిమారన్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆడియన్స్ అటెన్షన్ ఉంటుంది. అందులో అతను ఒక కథను పొడిగిస్తున్నాడు అంటే మరింత ఆసక్తి ఏర్పడుతుంది. విడుదల 1 చివర్లో కథ కొనసాగుతుందని ట్విస్ట్ ఇచ్చిన వెట్రిమారన్ విడుదల 2కి పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చాడు. ఇక చెప్పాల్సిన కథ నిజంగానే పెద్దగా ఉందన్న భావన వచ్చేలా చేశాడు.
విడుదల 2 కథను చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టాడు దర్శకుడు వెట్రిమారన్. విజయ్ సేతుపతి, గౌతం మీనన్ మధ్య సీన్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని ఆడియన్ ని ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియర్ సీన్స్ కూడా బాగున్నాయి. ఐతే అసలు కథ శాంతియుతంగా నడిచే ఈ ఉద్యమం హిం సా మార్గం ఎలా టర్న్ తీసుకుంది అన్నది బాగా చూపించారు.
పెరుమాళ్ తన జీవితంలో జరిగిన విషయాలు చెబుతూ సెకండ్ హాఫ్ అలా వెళ్తుంది. ఐతే వెట్రిమారన్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అర్ధం చేసుకున్న వారికి బాగానే అనిపిస్తుంది కానీ సీరియస్ గా సాగే కథనంలో లాజిక్ లు వైతికే మాత్రం కష్టమే. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొన్ని అవసరం లేదన్నట్టుగా ఉంటాయి.
క్లైమాక్స్ ఎపిసొడ్ కూడా లెంగ్తీగా ఉన్నా ఆకట్టుకుంటుంది. విడుదల 1 లో లీడ్ గా నటించిన సూరి పాత్రకు ఇందులో అంత ప్రాధాన్యత లేదు. ఐతే సినిమాలో కొన్ని సీన్స్ వెట్రిమారన్ ఈ సబ్జెక్ట్ ని ఎంత డీప్ గా స్టడీ చేసి రాసుకున్నాడో అర్ధం అవుతుంది. సమజాన్ని కాచి వడబోసినట్టుగా వెట్రిమారన్ కథనం ఉంటుంది. అంతేకాదు ఎంతో తపన వేదన అనుభవించిన వారు మాత్రమే ఇలాంటి సీన్స్ రాయగలరు అనిపించేలా చేశాడు. సాంఘిక అసమానతల పై పొరాటం చేసే కమ్యునిస్టులు, వారి జీవితాల గురించి ఎన్నో సినిమాలు వచ్చినా ఇలాంటి అటెంప్ట్ మాత్రం చేయలేదని చెప్పొచ్చు.
వెట్రిమారన్ ని నమ్మి సినిమా చూసేందుకు వచ్చిన ఆడియన్స్ ని అసలు ఏమాత్రం నిరాశ పరచలేదు. విజయ్ సేతుపతి యాక్టింగ్ ప్లస్ పాయింట్. సినిమా కచ్చితంగా వెట్రిమారన్ మార్క్ మూవీగా నిలుస్తుంది.
నటన & సాంకేతిక వర్గం :
విజయ్ సేతుపతి పెరుమాళ్ పాత్రలో అదరగొట్టాడు.. తన సహజ నటనకు వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తో సినిమా వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక మంజు వారియర్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కిశోర్ పాత్ర అలరించింది. గౌతం మీనన్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. మిగతా వారు కూడా అలరించారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఇళయరాజా మ్యూజి, బిజిఎం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమా అంతా నేచురల్ లొకేషన్స్ లో తీసి మెప్పించారు. ఇలాంటి సినిమాలు తను మాత్రమే చేయగలడు అని మరోసారి వెట్రిమారన్ ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
బాటం లైన్ :
విడుదల 2.. వెట్రిమారన్ నెవర్ డిజప్పాయింట్..!
రేటింగ్ : 3/5