HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Movie Reviews
  • >Telugu Review Of Turum Khans Full Of Laughs

Turum Khans Movie Review : పక్కా నవ్వించే తురుమ్ ఖాన్ లు తెలుగు రివ్వ్యూ

  • Author : Maheswara Rao Nadella Date : 08-09-2023 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
turum khans
Telugu Review Of Turum Khan Full Of Laughs

Turum Khans Movie Review : నటీనటుల నుంచి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాత కూడా కొత్తవారే అయినా తురుమ్ ఖాన్ లు (turum khans) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో రావాల్సినంత హైప్ వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

తురుమ్ ఖాన్ లు కథ:

తుపాకుల గూడెం అనే ఊర్లో జరిగే కథ. శంకర్(నిమ్మల శ్రీరామ్) యూత్ లీడర్, మరదలు లలిత (ఐశర్య ఉల్లింగాల)తో కరోనాలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వీరాజ్ బ్రహ్మ(దేవరాజ్ పాలమూర్) అందరూ బ్రహ్మం అని అంటారు. సిటీలో సాఫ్ట్ వేర్, పెళ్లి కాలేదు అని అందరు హెలనా చేసినా తన నోటి దూలతో అందరిని తిడుతూ ఉంటాడు. ఊర్లోకి వచ్చింది మొదలు తాగుడే పనిగా పెట్టుకుంటాడు. తాను కూడా పెళ్లి చేసుకోవాలను కుంటాడు. విష్ణు(అవినాష్ చౌదరి) కాలేజ్ లో లవ్ పద్మతో చిన్న మనస్పర్థతో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో ఊర్లో లాక్ డౌన్ విధిస్తారు. ఆ టైమ్ లో జరుగునున్న శంకర్ పెళ్లి ఆగిపోతుంది. పద్మ, విష్ణులను కలపడానికి స్వప్న సాయం చేస్తుంది. అదే క్రమంలో స్వప్న విష్ణుపై మనసు పడుతుంది. ఇక బ్రహ్మం భారతి(విజయ)తో ఎఫైర్ పెట్టుకోవాలను కుంటాడు. ఈ ముగ్గిరి కథే తురమ్ ఖాన్ లు సినిమా. శంకర్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.? దానికి కారణం ఎవరు.? విష్ణు, పద్మ కలిశారా.? స్వప్న స్టోరీ ఏంటి.? బ్రహ్మం, భారతి ఎఫైర్ ఎంత వరకు దారి తీసింది.? అసులు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి.? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

తెలంగాణ నేపథ్యంలో వచ్చే పాటతో టైటిల్స్ పడటంతోనే ప్రేక్షకులను విలేజ్ మూడ్ లోకి తీసుకెళ్లారు. శంకర్ పెళ్లి హాడవిడితో కథ మొదలు అవుతుంది. మొదటి ముగ్గురి హీరోల క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ లతో కథ పార్లల్ గా నడుస్తుంది. ముఖ్యంగా విలేజ్ బ్యాగ్ డ్రాఫ్ లో కథ కాబట్టి చాలా సహజంగా తెరకెక్కించారు. మన ఊర్లో జరిగే కథను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టినప్పటి రోజులను ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆద్యాంతం కామెడీతో ఫన్ని డైలాగ్ లతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు. సినిమాలో శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కథ. 133 నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వులే నవ్వులు. ఫస్ట్ ఆఫ్ చాలా హూషారుగా సాగిపోతుంది. సెకండ్ కాస్త నెమ్మదించిన మళ్లీ అదే జోరులో సాగుతుంది. ఇంటర్వేల్ సీన్ చాలా ఉత్కంఠబరితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూసిన తరువాత తృప్తిగా ఒక వింధు భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

ఎవరెలా చేశారు:

నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా సినిమా చూస్తున్నంత సేపు వాళ్లతో ట్రావెల్ అవుతుంటాము. సినిమాలో శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా మెచ్చూడ్ గా నటించారు. అలాగే జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో కట్టిపడేసింది. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ జీవించేశాడు. అసలు ఆయన రియల్ గా కూడా ఇలానే ఉంటాడేమో అనేంత సహజంగా చేశారు. ఇక భారతి తన స్క్రీన్ స్పేస్ లో అలరించింది. ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది. ఇక షేట్ క్యారెక్టర్, బుగ్గ, ట్రాక్టర్ డ్రైవర్, అలాగే బ్రహ్మం తండ్రి పాత్ర చేసిన వారు కూడా మంచి నటనను కనబరిచారు.

సాంకేతిక విభాగం:

చిత్ర దర్శకుడు ఎన్ శివ కళ్యాణ్ కొత్తవాడైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ ల కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది. తాను రాసుకున్న కథను ప్రేక్షకుడు ఆధ్యాంతం ఎంటర్టైన్ అయ్యేలా తీర్చిదిద్దగలిగారు. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుండి తనకు కథకు తగ్గట్టుగా నటింపజేయగలడం అది డైరెక్టర్ కే చెల్లుద్ది. సినిమాకు ముఖ్యమైన బలం నేపధ్య సంగీతం. సిచువేషన్ కు తగ్గట్టుగానే పాటలు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్లను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడంలో నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అఫ్ లో షార్ప్ గా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి బొంతల సెకండ్ హాఫ్ లో తన కత్తెరకు ఇంకాస్త పదులు పెట్టి ఉంటే చాలా బాగుండేది. మొత్తానికి ఎడిటర్ గా తన పని అద్భుతంగా నిర్వర్తించారు అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ పల్లే నేపథ్యంలో సాగే కథను ఏ విధంగా చూపించాలో అదేవిధంగా చూపించి తన పనితనాన్ని కనబరిచారు. ఇక ఫైనల్ గా సినిమాను నిర్మించిన ఎండి ఆసిఫ్ జానీ తురుమ్ ఖాన్ లు (turum khans) తెరకెక్కించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, మంచి ప్రొడక్షన్ తో రూపొందించారు. ఇది చిన్న సినిమా అని ఎక్కడ అనిపించదు అంటే దానికి కారణం ప్రొడక్షన్ వ్యాల్యూస్ అని చెప్పవచ్చు.

ప్లస్ లు:

  • కథా నేపథ్యం
  • సంగీతం
  • కామెడీ

చిత్రం: తురుమ్ ఖాన్ లు (Turum Khans)
నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
రచన-దర్శకత్వం: ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల,
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్,
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్.
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్: సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
పీఆర్ఓ: హరీష్, దినేష్
విడుదల: 08/09/2023

తురుమ్ ఖాన్ లు రేటింగ్: 3/5

Also Read:  Review : ‘Miss Shetty Mr Polishetty’ – ఎమోషనల్ & కామెడీ ఎంటర్టైనర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Comedy
  • Movie Review
  • Telugu Review
  • tollywood
  • Turum Khan

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd