Varalaxmi Sarathkumar’s Sabari: శబరి మూవీ రివ్యూ.. ఉత్కంరేపే ఎమోషనల్ డ్రామా!
- By Balu J Published Date - 09:45 AM, Fri - 3 May 24

Varalaxmi Sarathkumar’s Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా కొత్త అవతారంతో వచ్చింది. మెయిన్ లీడ్‌గా తెలుగులో ఆమెకు శబరి ఫస్ట్ మూవీ. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. మే 3న వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథ
సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) చిన్నతనం నుంచి తల్లి ప్రేమను కోల్పోతోంది. సవతి తల్లిని చూస్తే ఎంతో చిరాగ్గా పెరుగుతుంది. ఇక ఇంట్లో ప్రేమ దొరకని సంజన కాలేజీలో అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను ప్రేమిస్తుంది. ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. అయితే అరవింద్ మోసం చేస్తున్నాడని తెలిసి తన కూతురు రియాతో బయటకు వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఫ్రెండ్ లాయర్ రాహుల్ (శశాంక్) ఆపదకాలంలో సాయపడుతుంటాడు. మరో వైపు సూర్య (మైమ్ గోపీ) రియా కోసం అందరినీ చంపుతుంటాడు. సూర్య నుంచి రియాను ఎలా కాపాడుకుంటుంది? అసలు సూర్య కథ ఏంటి? సంజనకు వచ్చిన ఈ కష్టం ఎలా తీరుతుంది? ఈ ప్రయాణంలో అరవింద్, రాహుల్‌ల వల్ల సంజన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
సంజన పాత్రలో వరలక్ష్మీకి చాలా కొత్త. ఇంత వరకు విలన్‌గా భయపెట్టడమే తెలుగు ప్రేక్షకులు చూశారు. కానీ ఇందులో పూర్తిగా ఎమోషనల్ కారెక్టర్. బిడ్డ కోసం తల్లి పడే ఆరాటాన్ని చక్కగా చూపించింది. విలన్‌గా గణేష్, మైమ్ గోపీలు చక్కగా నటించారు. సపోర్టివ్ రోల్‌లో శశాంక్ మెప్పిస్తాడు. సునయన, అర్చన, బేబీ నివేక్ష, కృతిక ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ
శబరి పాయింట్‌ను సింపుల్‌గా చెప్పాలంటే.. బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం.. చేసే పోరాటం. ఈ కథను ఎన్ని రకాలైనా చెప్పొచ్చు. ఈ పాయింట్‌కే దర్శకుడు అనిల్ తన టేస్ట్‌ను జోడించాడు. కాస్త హారర్, సస్పెన్స్ అంశాలను జోడించాడు. ఎమోషనల్‌గా ఉంటూనే.. సస్పెన్స్, థ్రిల్లర్, కొన్ని చోట్ల హారర్ జానర్లను మిక్స్ చేసి శబరిని ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు.
ఎంటర్టైన్మెంట్‌తో పాటుగా ఎమోషన్‌ను జోడించి చెప్పడం కష్టతరమైన పని. అయితే శబరిలో ఎంటర్టైన్మెంట్ పార్ట్‌ను బలవంతంగా ఇరికించినట్టే అనిపిస్తుంది. సునయనతో చేయించిన కామెడీ నవ్వించదు. ఎంటర్టైన్మెంట్ పార్ట్ లేకపోవడంతో కాసింత బోర్‌గా ఫీల్ అవ్వొచ్చు. కానీ మదర్ డాటర్ సెంటిమెంట్‌ను బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు.
కథ ముందుకు వెళ్తున్న కొద్ది ప్రేక్షకుడికి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా దాదాపు ఫ్లాష్ బ్యాక్ సీన్లతోనే నడుస్తుంది. అసలు చిక్కు ముడి ఇంటర్వెల్‌కు తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు ముందుగానే కొందరు పసిగట్టేస్తారు. టెక్నికల్ ఈ మూవీ హై స్టాండర్డ్‌లో ఉంది. మాటలు కొన్ని చోట్ల మనసుని హత్తుకుంటాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
రేటింగ్ 2.75