Veekshanam : ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. మెసేజ్ తో మర్డర్స్ థ్రిల్లర్..
- By News Desk Published Date - 04:34 PM, Fri - 18 October 24

Veekshanam : రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్స్ గా పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాతలుగా మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీక్షణం. ఈ సినిమా నేడు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది.
కథ :
అర్విన్(రామ్ కార్తీక్), అతని ఫ్రెండ్ చిచి తన బెడ్రూమ్ కిటికీ లోంచి బైనాక్యులర్ తో చుట్టూ ఉన్న ఇళ్లల్లో అమ్మాయిలను చూస్తూ ఉంటారు. ఓ రోజు అర్విన్ అలా బైనాక్యులర్ లో వేరే ఇంట్లో నేహా(కశ్వీ)ని చూసి ప్రేమలో పడతాడు. తన ఫ్రెండ్ చిచి, తన బావ నారి(జబర్దస్త్ ఫణి) సహాయంతో నేహాని ప్రేమలో పడేస్తాడు. అనుకోకుండా అర్విన్ వల్ల నేహా అతన్ని దూరం పెడుతుంది. ఆ బాధలో ఉన్న అర్విన్ ఓ రోజు రాత్రి తన కిటికీలోంచి బైనాక్యులర్ తో చూస్తుంటే ఓ ఇంట్లో ఒక అమ్మాయి(నక్షత్ర నైనా) మర్డర్ చేయడం చూస్తాడు. ఈ ఘటనతో అర్విన్ షాక్ అవుతాడు. మరో రోజు అర్విన్, చిచి, నారి ముగ్గురు కలిసి అదే అమ్మాయి ఇంకొకరిని మర్డర్ చేయడం చూస్తారు.
ఆ అమ్మాయి మర్డర్ చేసిన ఒకరు మిస్ అయ్యారు అని టీవీలో చూడటంతో అర్విన్ పోలీసులకు ఈ విషయం చెప్తాడు. పోలీస్ మిస్సింగ్ కేసు ఫోటోలు అన్ని చూపిస్తే అందులో మర్డర్ చేసిన అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది. మిస్ అయిన వాళ్లలో కొంతమందిని ఈ అమ్మాయే చంపింది అని అర్విన్ చెప్తే అసలు ఆ అమ్మాయి ఎప్పుడో చనిపోయింది అని పోలీసులు చెప్తారు. దీంతో ఈ ముగ్గురు షాక్ అవుతారు. అసలు చనిపోయిన అమ్మాయి మనుషులని ఎలా చంపుతుంది? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు చంపుతుంది? నేహా – అర్విన్ ల ప్రేమ కథ ఏమైంది? ఆ మర్డర్ మిస్టరీని అర్విన్ సాల్వ్ చేశాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
మర్డర్ థ్రిల్లర్స్ అన్ని ఒకేలా ఉంటాయి. కానీ వాటిని ఎలా చూపించారు అనేదానితోనే థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ వీక్షణం సినిమాలో ఈ మర్డర్ మిస్టరీ వెనకాల కథ ఏంటి అని అందరూ మాములు సినిమాల్లాగే ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు మర్దర్లు చేస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోతారు ప్రేక్షకులు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పాటు ఓ మంచి మెసేజ్ ని కూడా ఇచ్చారు. అసలు ఇలాంటి మర్డర్ మిస్టర్ కథల్లో మెసేజ్ ఇవ్వడం కొత్త. అందులోను ఈ మెసేజ్ ని చాలా బాగా చూపించారు.
ఫస్ట్ హాఫ్ ప్రేమ కథతో కాస్త బోర్ కొట్టినా హీరో మర్డర్ ని చుసిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది. ఇక మర్దర్లు చేసే అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని పోలీసులు చెప్పడంతో అక్కడ్నుంచి సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీతో సాగుతున్న కథని ఆ మిస్టరీ సాల్వ్ చేసే భాగంలో కథను మరో వైపు తీసుకెళ్లి ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా బాగా రాసుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్లింగ్ తో భయపెడుతుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు.
నటీనటులు :
హీరో రామ్ కార్తీక్ తన నటనతో, క్యూరియాసిటీ ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించి బాగానే మెప్పించాడు. హీరోయిన్ కశ్వి తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పించింది. జబర్దస్త్ ఫణి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అక్కడక్కడా నవ్వించారు. నక్షత్ర నైనా మర్దార్లు చేసే అమ్మాయి పాత్రలో బాగా చేసింది. సమ్మెట గాంధీ, దయానంద్ రెడ్డి, చిత్రం శీను.. మిగిలిన నటీనటులు అందరూ వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు :
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. ఆ మ్యూజిక్ తోనే భయపెట్టారు కూడా. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్ పర్ఫెక్ట్. దర్శకుడు మర్డర్ మిస్టరీ కథని సరికొత్తగా థ్రిల్లింగ్ అంశాలతో పాటు మెసేజ్ తో బాగా రాసుకొని చూపించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
ప్లస్ లు :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఇంటర్వెల్
సినిమాలో ఇచ్చే మెసేజ్
హీరోయిన్ అందాలు
మైనస్ లు :
లవ్ స్టోరీలో సాగదీత
రేటింగ్ : 3 / 5
గమనిక : ఈ సినిమా రివ్యూ మరియు రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం.
Also Read : Rishab Shetty : జై హనుమాన్ లో కాంతారా స్టార్..?