Maruthi Nagar Subramanyam : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీ రివ్యూ..
- By News Desk Published Date - 12:32 AM, Fri - 23 August 24
Maruthi Nagar Subramanyam : రావు రమేష్(Rao Ramesh) మెయిన్ లీడ్ లో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు, మోహన్ కార్య సంయుక్త నిర్మాణంలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో రిలీజ్ అయింది. ఆగస్టు 23న మారుతీ నగర్ సుబ్రమణ్యం రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ :
సుబ్రహ్మణ్యం(రావు రమేష్) చేస్తే గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేస్తాను అని చిన్నప్పట్నుంచి ఫిక్స్ అవుతాడు. ప్రతి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసినా ఏది రాదు. ఈ లోపు పెళ్లి అయి భార్య కళారాణికి(ఇంద్రజ) గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సుబ్రహ్మణ్యంకు జాబ్ వచ్చినా అది కోర్టులో కేసు పడటంతో అది కూడా పోయినట్టే. మరోపక్క ఎప్పటికైనా తన డబ్బులతోనే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఇంట్లో ఖాళీగా కూర్చొని భార్య సంపాదనతో బతుకుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్) తను అల్లు అరవింద్ కొడుకని భ్రమ పడుతూ ఉంటాడు. అర్జున్ తొలిచూపులోనే కాంచన(రమ్య)తో ప్రేమలో పడతాడు. కళారాణి ఇంట్లో లేనప్పుడు ఒకరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. ఆ డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయా అని ఆలోచిస్తారు తండ్రి కొడుకులు. ఈ క్రమంలో అవసరాలు, అప్పులు ఉండటంతో ఆ డబ్బులు ఖర్చుపెట్టేస్తారు తండ్రి కొడుకులు. అసలు ఆ 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్ కి ఎలా వచ్చాయి? సుబ్రహ్మణ్యంకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఎందుకు గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేయాలనీ ఫిక్స్ అవుతాడు? ఇల్లు కట్టాడా? అర్జున్, కాంచనల ప్రేమ ఏమైంది? అర్జున్ ఎందుకు అల్లు అరవింద్ కొడుకు అని అనుకుంటున్నాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ :
మారుతీ నగర్ సుబ్రమణ్యం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ చిన్నిపాటి ఎమోషన్ ని కూడా చూపిస్తూ చక్కగా తెరకెక్కించారు. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం.. ఇలా రియల్ గా జరిగిన రెండు కేసులను తీసుకొని వాటిని లింక్ చేస్తూ మంచి కామెడీ కథగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో సుబ్రహ్మణ్యం, అతని ఫ్యామిలీ, అర్జున్ ప్రేమ, కాంచన ఫ్యామిలీ గురించి చూపిస్తారు. అలాగే సుబ్రహ్మణ్యం అకౌంట్ లో డబ్బులు పడి, వాటిని ఖర్చుపెట్టడం చూపించి ఆసక్తికర ఇంటర్వెల్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో ఆ డబ్బుల వల్ల సుబ్రహ్మణ్యం పడే మనోవేదన, అవి ఖర్చుపెట్టాక వచ్చే కష్టాలతో సాగించారు. చివర్లో క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఇచ్చి మెప్పించారు.
సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్స్ లు చాలా ఉండటంతో బన్నీ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సరదాగా ఫుల్ గా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమా చూసేయొచ్చు. మన అకౌంట్ లో అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బులు పడితే ఎలా ఉంటుంది అని కామెడీగా ఆసక్తిగా చూపించారు. ఇక సినిమా ఫుల్ కామెడీగా ఉండటం, సుకుమార్, అల్లు అర్జున్ ప్రమోషన్స్ కి రావడం, సుకుమార్ భార్య ఈ సినిమాని రిలీజ్ చేయడం, ఈ సినిమాలోని ఒక సాంగ్ బన్నీ సినిమాల రిఫరెన్స్ లతో చేయడంతో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి.
నటీనటులు :
రావు రమేష్ మొదటిసారి ఫుల్ గా నవ్వించారు. ప్రతి సీన్ లోను తన కామెడీని పండించారు. సుబ్రహ్మణ్యం పాత్ర రావు రమేష్ తప్ప ఎవ్వరూ చేయలేరేమో అనిపించింది సినిమా చూస్తుంటే. ఇంటిని పోషించే భార్య పాత్రలో ఇంద్రజ ఎమోషనల్ గా బాగా నటించింది. అంకిత్ కొయ్య కూడా ఫుల్ గా నవ్వించాడు. హీరోయిన్ తో లవ్ ట్రాక్ లోను మెప్పించాడు అంకిత్. ఇక రమ్య పసుపులేటి అందాలు బాగానే ప్రదర్శించి అక్కడక్కడా తన సోషల్ మీడియా నటనని కనబర్చింది. అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, ప్రవీణ్, శివన్నారాయణ, నూకరాజు.. మిగిలిన నటీనటులు కూడా కామెడీ పండించారు.
సాంకేతిక అంశాలు :
ఈ సినిమాలో పాటలు వినడానికి, చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గానే కనిపించాయి. కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. సరికొత్త కథని తీసుకొని కామెడీ కథనంతో డైరెక్టర్ లక్ష్మణ్ కార్య మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాని తీయడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
సినిమా ప్లస్‌లు :
మొదట్నుంచి చివరిదాకా సాగే కామెడీ
రావు రమేష్, అంకిత్ కొయ్య
క్లైమాక్స్
సాంగ్స్
సినిమా మైనస్‌లు :
ఎమోషన్ సీన్స్
కొన్ని ల్యాగ్ సీన్స్
రేటింగ్ : 3/5
Also Read : Nani : ఆ జోనర్ మాత్రం టచ్ చేయనంటున్న నాని..!