Nani : ఆ జోనర్ మాత్రం టచ్ చేయనంటున్న నాని..!
సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన
- By Ramesh Published Date - 08:47 AM, Thu - 22 August 24

న్యాచురల్ స్టార్ నాని త్వరలో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం నాని దేశం మొత్తం తిరిగేస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జోక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ తో నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram)పై అంచనాలు డబుల్ అయ్యాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని తను హర్రర్ సినిమాలు మాత్రం చేయనని చెప్పారు. ఎందుకో ఆ జోనర్ సినిమాలు అంతగా ఇష్టం ఉండదని అన్నారు. ప్రతి సినిమా విషయంలో తను చాలా ఫోకస్ గా ఉంటానని.. లక్కీగా అన్ని సినిమాలు వర్క్ అవుట్ అవుతున్నాయని అన్నారు నాని. ఆల్రెడీ నాని (Nani) లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న(Hi Nanna) తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.
Also Read : Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!
నానితో ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా చేసిన వివేక్ ఆత్రేయ ఈసారి యాక్షన్ మూవీగా సరిపోదా శనివారం తెరకెక్కించాడు. నాని సరిపోదా శనివారం ఆగష్టు 29న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మీద కూడా తన అభిమానాన్ని తెలియచేస్తున్నారు.
నాని నెక్స్ట్ ఇయర్ హిట్ 3 సినిమాతో వస్తానని ఆడియన్స్ తో చెప్పారు. టైర్ 2 హీరోగా ఉన్న నాని సరిపోదా శనివారతో టైర్ 1కి ప్రమోట్ అయ్యేలా ఉన్నాడని ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.