HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Movie Reviews
  • ⁄Akhil Akkineni Agent Movie First Review

Agent Review: అఖిల్‌ కి మళ్లీ డిజాస్టరా? హిట్టా? ఏజెంట్ మూవీ ఎలా ఉందంటే!

  • By Balu J Published Date - 01:16 PM, Fri - 28 April 23
  • daily-hunt
Agent Review: అఖిల్‌ కి మళ్లీ డిజాస్టరా? హిట్టా? ఏజెంట్ మూవీ ఎలా ఉందంటే!

అఖిల్ అక్కినేని (Akhil Akkineni).. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ నుంచి టాలీవుడ్ కు పరిచయమైన యంగ్ హీరో. నాన్న నాగార్జున నటనను, నాగేశ్వర్ రావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరో. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అఖిల్ కు హిట్స్ పడకపోవడం అటు అక్కినేని అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న అఖిల్ తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ (Agent) సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం కోసం స‌రికొత్త‌గా మేకోవ‌ర్ అయిన అఖిల్ హిట్ కొట్టాడా? మళ్లీ ఫ్లాపునే జేబులో వేసుకున్నాడా? అనేది తేలియాలంటే ఈ రివ్యూ (Review) చదువాల్సిందే

క‌థ‌:
రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమాగా చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. రా ఆఫీసర్ అయిన మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫ‌లం అవుతుంటాడు. ఇక అప్పుడు వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డానికి కొంటె ప్రవర్తన కలిగిన వ్య‌క్తి (అఖిల్‌) అయితే బెటర్‌ అని, అలాంటి వాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని పట్టుకోగలరని భావిస్తాడు. దాంతో ఆ ఆపరేషన్‌ (Operation) ఏజెంట్‌ని అఖిల్‌కి అప్పగిస్తారు. దీంతో అఖిల్‌ తన కొంటెతనంతో, అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

నటీనటుల విశ్లేషణ

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమా చూస్తే త‌ప్ప‌క అర్ధ‌మ‌వుతుంది. యాక్ష‌న్ సన్నివేశాల‌లో అద‌ర‌గొట్టాడు. అయితే న‌ట‌న‌లో కొద్దిగా తేలిపోయాడు. ఇక క‌థానాయిక సాక్షి వైద్య త‌న న‌ట‌న‌తో ప‌ర్వాలేద‌నిపించింది. మ‌మ్ముట్టితో పాటు ఇత‌ర న‌టీన‌టులు కూడా త‌మ పాత్రల‌కి న్యాయం చేశారు. ఇక ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి (Surendar Reddy) మూవీని అందంగా మ‌ల‌చ‌డంతో విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ఈ సినిమాకి క‌థ‌లో మ్యాట‌ర్ లేదు. సోల్ పూర్తిగా మిస్ అయింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ప‌ర్వాలేదు కాని లవ్ స్టోరీ, మ్యూజిక్, బీజీఎమ్, విలన్ రోల్ మాత్రం బిస్కెట్ అయింద‌నే చెప్పాలి.

ప్ల‌స్ పాయింట్స్
ఇంట‌ర్వెల్
టెర్రీఫిక్‌ యాక్షన్‌ స్టంట్స్ (Action Stunts)
మ‌మ్ముట్టి న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:
క‌థ‌
ల‌వ్ స్టోరీ (Love Story)
బీజీఎమ్

ఎలా ఉందంటే
భారీ ఖ‌ర్చుతో ఏజెంట్ సినిమాని తెర‌కెక్కించ‌గా, ఈ సినిమాకు భారీ ఖర్చు చేశారని అది ప్రతి ఫ్రెములో కనిపిస్తుంది. హై వోల్టేజ్ సీన్ తో సినిమా క్లైమాక్స్ (Climax) కి చేరుకుంటుంది. ఆ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు , ఆఇ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి .స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ లో ఉండవలసిన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి కొంత మ‌జా ఇస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ త‌ప్ప మిగ‌తా అంతా బోరింగ్ గానే ఉంటుంది. అభిమానుల‌కి మాత్ర‌మే ఈ సినిమా న‌చ్చుతుంది.

రేటింగ్: 2.0/5

Tags  

  • Agent Movie
  • Akhil Akkineni
  • latest tollywood news
  • Movie Review
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!

Mega Update: భోళా మేనియా త్వరలో ప్రారంభం.. మాస్ స్టెప్పులకు మెగాస్టార్ రెడీ!

ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో ఆకట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ తో మన ముందుకు రాబోతున్నాడు.

  • NBK108 Title: ‘భగవంత్ కేసరి’గా బాలయ్య బాబు.. ‘ఐ డోన్ట్ కేర్’ ట్యాగ్ లైన్ తో!

    NBK108 Title: ‘భగవంత్ కేసరి’గా బాలయ్య బాబు.. ‘ఐ డోన్ట్ కేర్’ ట్యాగ్ లైన్ తో!

  • Dhanush New look: కొత్త లుక్ లో ధనుష్.. రామ్ దేవ్ బాబా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

    Dhanush New look: కొత్త లుక్ లో ధనుష్.. రామ్ దేవ్ బాబా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

  • Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్

    Samantha: షూటింగ్స్ కు విరామం.. తల్లితో కలిసి సమంత డిన్నర్ డేట్

  • Allu Arjun@Trivikram: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్!

    Allu Arjun@Trivikram: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్!

Latest News

  • Balineni : జ‌గ‌న్ పొలిటిక‌ల్ రివ్యూ, బాలినేని దారెటు?

  • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Live After Death :చనిపోయిన వారితో ముచ్చట్లు పెట్టొచ్చట!!

  • Headache: వ్యాయామం తర్వాత తలనొప్పి వస్తుందా.. అయితే కారణాలు ఇవే కావొచ్చు..!

  • CM Post Record : గురువుని మించిన శిష్యుడు

Trending

    • Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్

    • Twitter New Feature : ఒక్క ఫేక్ ఫోటో.. కొత్త ఫీచర్ తెచ్చేలా చేసింది

    • Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్

    • Black Beans Nutrition : హెల్త్ క్వీన్.. బ్లాక్ బీన్ విశేషాలు

    • Atal Pension Yojana: ప్రతి నెలా మనీ సేవ్ చేయండి.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పొందండిలా..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version