Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పిల్లలు జంతువులతో ఆడుకునే వీడియోలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
- By Nakshatra Published Date - 08:30 AM, Thu - 7 July 22

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పిల్లలు జంతువులతో ఆడుకునే వీడియోలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పిల్లలు జంతువులతో కలిసి ఆడుకోవడం వాటితో కలిసి సరదాగా సరదాగా గడపడం వంటి వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. దీనితో ప్రతి ఒక్కరూ వారి పిల్లలతో ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అదేగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక చిన్నారి నీలిరంగు టోపీ మరియు నా లెక్క టీషర్టు ధరించి ఉంటాడు. ఆ పిల్లవాడు తన ఎదురుగా ఒక జింక ఉండగా దానినే ముద్దు పెట్టుకుంటాడు. అయితే సరిగా ముద్దు పెట్టుకోలేదు అని భావించిన ఆ చిన్నారి మళ్లీ ఆ జింక గడ్డాన్ని పట్టుకొని దానిని ప్రేమతో ముద్దాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారి ఆ జింకను ముద్దాడిన సమయంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ప్రేమ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆ బాలుడు స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 33,000 మంది చూడగా 3,000 కంటే ఎక్కువగానే లైక్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేయగా, ఇంకొందరు మాత్రం లవ్ సింబల్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
Related News

Rhino Video Viral: గ్రామంలో ఖడ్గమృగం హల్ చల్.. చక్కర్లు కొడుతున్న వీడియో!
ఖడ్గమృగం ఓ గ్రామంలో చక్కర్లు కొడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.