Gold rates today : స్థిరంగానే పసిడి, వెండి ధరలు..హైదరాబాద్ లో ఎంత ఉందంటే..!!
- By hashtagu Published Date - 09:39 AM, Sun - 27 November 22

దేశంలో పసిడి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 48,550గా ఉంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం 4,855రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రెట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. కేజి వెండి రూ. 200తగ్గి 61,800కు చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 67,500గా ఉంది.