UP Women: శ్రీకృష్ణుడే ఆమె భర్త.. విగ్రహంతో ఏడడుగులు వేసిన మహిళ!
ఆధ్యాత్మికమో, లేక దేవుడి మీద భక్తినో ఓ మహిళ శ్రీకృష్ణుడ్ని (Lord Srikrishna) పెళ్లి చేసుకుంది.
- By Balu J Published Date - 02:33 PM, Tue - 14 March 23

ఆధ్యాత్మికమో, లేక దేవుడి మీద ప్రేమనో ఓ మహిళ శ్రీకృష్ణుడ్ని (Lord Srikrishna) పెళ్లి చేసుకుంది. యూపీలోని ఔరయ్యా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రిటైర్డ్ టీచర్ రంజిత్ సింగ్ సోలంకి కుమార్తె రక్ష (30) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎల్‌ఎల్‌బి చదువుతోంది. రక్ష తన జీవితాంతం శ్రీకృష్ణుడి (Lord Srikrishna) తో ఉండాలని నిర్ణయించింది. అయితే శ్రీకృష్ణుడిని వివాహమాడాలనే కోరికను తన తండ్రితో చెప్పి ఒప్పించింది. దీంతో కూతురు అభిరుచికి తగ్గట్టుగానే కళ్యాణ మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు.
అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బరాత్ లో ఊరేగించారు. కల్యాణ వేదిక వద్దకు చేరుకోగా, డీజే పాటలకు బంధువులు డాన్సులు చేశారు. పెళ్లిలో ఏయేం ఏర్పాటు చేస్తారో.. అలాంటవన్నీ ఏర్పాటు చేశారు. నోరూరించే వంటకాలు, సంగీత్ లాంటివీ ఆకట్టుకున్నాయి. రాత్రి పెళ్లి (Marriage) తర్వాత, వధువు కృష్ణుడి విగ్రహాన్ని జిల్లాలోని సుఖ్‌చైన్‌పూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత కృష్ణుడి (Lord Srikrishna) విగ్రహంతో పుట్టింటికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: YS Sharmila Arrested: బ్రేకింగ్.. ఢిల్లీలో షర్మిల అరెస్ట్