RRR Celebrations: ఆస్కార్ ఆనందం.. ‘RRR’ టీమ్‌కి రాజమౌళి గ్రాండ్ పార్టీ!
ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం సెలబ్రేషన్స్ లో మూడ్ లో ఉంది. లాస్ ఏంజిల్స్‌లోని రాజమౌళి (RRR) బృందాని గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
- By Balu J Published Date - 12:59 PM, Tue - 14 March 23

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆర్ఆర్ఆర్ (RRR) విదేశాల్లోనూ ఎక్కడాలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఆస్కార్ (Oscar) కు నామినేట్ నాటు నాటు సాంగ్ చివరకు అవార్డును గెలుచుకొని టాలీవుడ్ సత్తా ఏంటో చాటి చెప్పింది. అయితే ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం సెలబ్రేషన్స్ లో మూడ్ లో ఉంది. లాస్ ఏంజిల్స్‌లోని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంట్లో సోమవారం (RRR) బృందం సరిగ్గా అదే చేసింది.
95వ ఆస్కార్ అవార్డ్స్‌లో విజయం సాధించిన తర్వాత ఘనంగా పార్టీ (Party) చేసుకుంది టీం. సంబురాలు చేసుకుంటూ ఆస్కార్ ఆనందాలను ఆస్వాదిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన తన సోషల్ మీడియా లో పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) అభిమానుల నుంచి ఆ చిత్రాలు, వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒక వీడియోలో, కీరవాణి పియానో వాయిస్తూ, నటీనటులు, ఇతరులు ఉత్సాహంగా వింటున్నారు. మరో వీడియో క్లిప్‌లో, నటుడు రామ్ చరణ్ ఆస్కార్ గెలుచుకున్న అన్ని ఇతర అవార్డులతో పోజులిచ్చాడు. మొత్తంమీద ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ ప్రదర్శనతో హాలీవుడ్ ను ఆకట్టుకొని గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుని, ఆస్కార్ అవార్డుతో ఆర్ఆర్ఆర్ ప్రయాణాన్ని దిగ్విజయంగా ముగించింది.
The night before the oscars !
All set to rock tom. 🤞🏻🤞🏻🤞🏻
Jai Hind 🇮🇳🪷@RRRMovie @AlwaysRamCharan @ssrajamouli @ssk1122 @Shobu_ @ssk1122 @sunnygunnam pic.twitter.com/73r5eqQ0ZJ— Upasana Konidela (@upasanakonidela) March 12, 2023
Also Read: Rana Naidu: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మోస్ట్ వాచ్డ్ #1గా ‘రానా నాయుడు’

Related News

Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు..