LIC Jeevan Azad Policy: ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ పూర్తి వివరాలు
ట్యాక్స్ పడకుండా మంచి లబ్ధి పొందేందుకు ఎల్‌ఐసీ వారి జీవన్ ఆజాద్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నాన్ - పార్టిసిపేటింగ్, నాన్ - లింక్డ్ గ్యారెంటీ ఎండోమెంట్
- By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Sun - 5 March 23

ఇంకో నెల రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. ఇప్పటికే ట్యాక్స్, బీమా రంగాల్లో హడావిడి కనిపిస్తోంది. సంప్రదాయ పాలసీలు తీసుకోవాలని ఎల్‌ఐసీ ఏజెంట్లు కూడా తొందరపెడుతున్నారు. దీనికి ప్రధానం కారణం ట్యాక్స్. సెక్షన్ 10 (10D) ప్రకారం ప్రస్తుతం డెత్ బెనిఫిట్ సొమ్ము, వార్షిక ప్రీమియం కంటే కనీసం 10 రెట్లు ఉంటే ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిపై ట్యాక్స్ పడుతుంది. పాలసీలపై వచ్చే ఆదాయం, వాటి మొత్తం వార్షిక ప్రీమియంలు రూ.5 లక్షలకు మించి ఉంటే పన్ను కట్టాల్సిందే. ట్యాక్స్ పడకుండా మంచి లబ్ధి పొందేందుకు ఎల్‌ఐసీ వారి జీవన్ ఆజాద్ పాలసీ (LIC Jeevan Azad Policy) ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ గ్యారెంటీ ఎండోమెంట్ పాలసీ. మెచ్యూరిటీ టైంలో హామీతో కూడిన రాబడి ఇస్తుంది.
జీవన్ ఆజాద్ పాలసీ (LIC Jeevan Azad Policy):
ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన సరికొత్త పథకం జీవన్ ఆజాద్. ఇందులో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనం రెండూ అందుతాయి. కనిష్ట ప్రాథమిక హామీ కింద రూ. 2 లక్షలు, గరిష్ట ప్రాథమిక హామీ కింద రూ. 5 లక్షలు ఇస్తారు. పాలసీ వ్యవధి 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఏదైనా ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి మెచ్యూరిటీ కంటే ముందే మరణిస్తే, బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు సమాన మొత్తాన్ని చెల్లిస్తారు. అంటే పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు:
పాలసీదారు వీలును బట్టి ప్రీమియం ఎంచుకోవచ్చు. 12 నెలలు, లేదా 6 నెలలు లేదా మూడు నెలలు లేదా నెలవారీగా అయినా ప్రీమియం చెల్లించవచ్చు. 20 ఏళ్ల కాల వ్యవధికి మీరు పాలసీ తీసుకుంటే 12 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు చెల్లించక్కర్లేదు. ఆ ఎనిమిది సంవత్సరాలు మీరు పాలసీ పరిధిలోనే ఉంటారు. మూడు నెలల వయసున్న పిల్లల నుంచి 50 ఏళ్ల వరకు ఉండే ఎవరి పేరు మీద అయినా జీవన్ ఆనంద్ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రెండేళ్లు పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత ఇతర పాలసీల్లో లాగానే ఇందులో కూడా సరెండర్ విలువలో 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు.
సంప్రదాయ పాలసీలు:
సంప్రదాయ పాలసీల్లో రాబడి తక్కువగా ఉన్నా భద్రత ఎక్కువగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్‌లు, ట్యాక్స్-ఫ్రీ మెచ్యూరిటీ రాబడి, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు, రిస్క్ ఇష్టం లేని వాళ్లు సంప్రదాయ పాలసీలను ఎంచుకుంటారు. ఏజెంట్లు చెప్పారని కాకుండా మీకు అనుకూలమైన ఆర్థిక రక్షణ ఇచ్చే పాలసీ తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు జెండే సూచిస్తున్నారు. బీమా, పెట్టుబడి అంచనాల ఆధారంగా తీసుకోవాలని అంటున్నారు. పాలసీదారు వయస్సు, పెట్టుబడి ప్రత్యామ్నాయాలు, మెచ్యూరిటీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ పాలసీలు తీసుకోవాలని, ఎక్కువ ప్రయోజనాలు ఆశించేవారు వేరే వాటిని సెలక్ట్ చేసుకోవాలని ఆప్టిమా మనీ మేనేజర్స్ వ్యవస్థాపకుడు పంకజ్ మత్‌పాల్ సూచిస్తున్నారు.
Also Read: Andrey Botikov: స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్య.. !

Related News

Profit in Business: మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలను పొందడానికి మీ పని ప్రదేశంలో ఈ దిశలో కూర్చోండి
కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు - నియమానుసారం ఉన్నపుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం..