HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Will Rajamouli Even Respond To Varanasi Controversies

Rajamouli: వార‌ణాసి వివాదాలపై ఎస్ఎస్‌ రాజమౌళి స్పందిస్తారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు, టైటిల్ వివాదంపై చర్చలు, వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, భక్తుల దృష్టి ఇప్పుడు రాజమౌళిపైనే ఉంది.

  • Author : Gopi Date : 19-11-2025 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Rajamouli

Rajamouli: భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఈసారి ఆయన సినిమాల కారణంగా కాకుండా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన కొత్త ప్రాజెక్ట్ టైటిల్‌పై తలెత్తిన అభ్యంతరాల కారణంగా వార్తల్లో నిలిచారు.

హనుమాన్‌పై వ్యాఖ్యలు, ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన

తాజాగా వారణాసి టైటిల్ లాంచ్ కార్య‌క్ర‌మంలో రాజమౌళి పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన హనుమంతుడిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్లపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

Also Read: Jamal Khashoggi: ఎవరు ఈ జమాల్ ఖషోగ్గీ? ఆయన హత్యకు కారణాలు ఏమిటి?

టైటిల్‌పై కొత్త వివాదం

ఇదిలా ఉండగా రాజమౌళి.. మ‌హేశ్ బాబుతో చేసే సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌పై ఒక యువ సినీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చింది. ‘వారణాసి’ అనే టైటిల్‌ను తాము తమ సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నామని, రాజమౌళి ఆ టైటిల్‌ను ఉపయోగించడం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయంగా మారింది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు చిన్న ప్రాజెక్టుల టైటిల్‌ను వాడడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు, టైటిల్ వివాదంపై చర్చలు, వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, భక్తుల దృష్టి ఇప్పుడు రాజమౌళిపైనే ఉంది. ఈ ఆరోపణలు, అభ్యంతరాలపై ఆయన అధికారికంగా స్పందిస్తారా? లేక ప్రస్తుతానికి మౌనం పాటిస్తారా? అనేది చూడాలి. రాజమౌళి వివరణ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema News
  • controversies
  • mahesh babu
  • rajamouli
  • tollywood
  • varanasi

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd