Japan Parents – Dating Apps : డేటింగ్ యాప్‌లలో బిజీగా జపాన్ పేరెంట్స్.. ఎందుకు ?
Japan Parents - Dating Apps : డేటింగ్ యాప్స్ .. ఇవి యూత్ కే పరిమితమని చాలామంది అనుకుంటారు.కానీ జపాన్ లో ఇప్పుడు యూత్ యొక్క పేరెంట్స్ కూడా డేటింగ్ యాప్స్ వాడుతూ బిజీగా గడుపుతున్నారు.ఇంతకీ ఎందుకో తెలుసా ?
- By Pasha Published Date - 03:15 PM, Tue - 5 September 23

Japan Parents – Dating Apps : డేటింగ్ యాప్స్ .. ఇవి యూత్ కే పరిమితమని చాలామంది అనుకుంటారు.
కానీ జపాన్ లో ఇప్పుడు యూత్ యొక్క పేరెంట్స్ కూడా డేటింగ్ యాప్స్ వాడుతూ బిజీగా గడుపుతున్నారు.
ఇంతకీ ఎందుకో తెలుసా ?
Also read : INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం
జపాన్‌లో ఇప్పుడు అమ్మాయిల కొరత నెలకొంది. అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో డేటింగ్ యాప్స్ ను అక్కడి యువకులు తెగ వాడేస్తున్నారు. తమకు అనుగుణంగా ఉండే అమ్మాయి కోసం పెళ్లి కాని అబ్బాయిలు అలుపెరగకుండా సెర్చింగ్ చేస్తున్నారు. అబ్బాయిలే కాదు.. వాళ్ల పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఐడీలు క్రియేట్ చేసుకొని మరీ.. డేటింగ్ యాప్ లలో మంచి కోడలి కోసం వెతుకులాడుతున్నారు. మన ఇండియాలో మాట్రిమోనీ వెబ్ సైట్లు ఎక్కువ. అలాగే జపాన్‌లో డేటింగ్ యాప్స్ ఎక్కువ. డేటింగ్ యాప్స్ ద్వారా పెళ్లి సంబంధాలను వెతుక్కునే ట్రెండ్ జపాన్ లో జోరుగా నడుస్తోంది. అయితే డేటింగ్స్ యాప్స్ లో అమ్మాయిని వెతకడం అంత ఈజీ కాదు. ఎవరైనా అమ్మాయి ఫోటో నచ్చితే.. ఆమెతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ ఉందని డేటింగ్ యాప్ వాళ్లకు ఒక అప్లికేషన్ సమర్పించాలి. ఆ అప్లికేషన్ లో అబ్బాయి తరఫు వారి మొత్తం వివరాలను ఇంటి అడ్రస్ తో సహా నమోదు చేయాలి. అబ్బాయి ఫొటోలు కూడా అప్ లోడ్ చేయాలి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ? ఏం చదివాడు ? అనే వివరాలను సమర్పించడం తప్పనిసరి. ఇవన్నీ ఆ అమ్మాయి ప్రొఫైల్ నిర్వహించే వారికి డేటింగ్ యాప్ వాళ్లు పంపిస్తారు. ఆ సమాచారం ఆధారంగా అమ్మాయి తరఫు వాళ్లు తదుపరి నిర్ణయం (Japan Parents – Dating Apps) తీసుకుంటారు.
Also read : Stay At Home : హైదరాబాద్ వాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు
జపాన్ లో అమ్మాయిలపై ఎన్నెన్ని ఆంక్షలో..
- జపాన్ మహిళలు కెరీర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తారు. పెళ్లై పిల్లలు పుడితే కెరీర్ ముగిసిపోతుందనే అపోహలో వారు ఉన్నారని పలు సర్వేల్లో గుర్తించారు.
- 1975 నుండి జపాన్ లో సంతానోత్పత్తి రేటు క్రమంగా క్షీణిస్తూనే ఉంది. ఇదే పరిస్థితి మరికొన్ని ఏళ్లపాటు కొనసాగితే.. వచ్చే 25 ఏళ్లల్లో ఆ దేశంలో జనాభా ఉండరు. ఫలితంగా జపాన్ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- జపాన్ విద్యార్థినులు పోనీటెయిల్ అనే హెయిర్‌స్టైల్ లో స్కూల్స్ కు వెళ్తుంటారు. పోనీటెయిల్ వేసుకొని రావడం వల్ల జుట్టు కింద మెడ భాగం బయటకు కనిపిస్తుందని, దీనివల్ల క్లాస్ రూమ్ లో విద్యార్థుల దృష్టి మరలుతుందని ఓ సర్వేలో తేలిందట. అందుకే జపాన్ లోని ఓ స్కూల్ ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై నిషేధం విధించింది.
- జపాన్‌లో అమ్మాయిలకు సంబంధించి ఇటువంటి ఆంక్షలు ఇంకా చాలానే ఉన్నాయి.
- జపాన్ లోని స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిలు సాక్స్ పొడవుగా ఉన్నవే ధరించాలి. అలాగే స్కర్ట్ కూడా పొడవుగా ఉండాలి. అంటే మోకాలు దాటి ఉండాలి.
- జపాన్ లో అమ్మాయిలు ధరించే లో దుస్తులు విషయంలో కూడా ఆంక్షలున్నాయి. అమ్మాయిలు తెల్లని రంగు ఉన్న లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆంక్షలు విధించారు.
- జపాన్ లో అమ్మాయిలు జుట్టుకు నలుపు తప్ప ఎలాంటి రంగు వేసుకోకూడదు.