Dera Baba: డేరా బాబా అంటే అట్లుంటది..పెరోల్ పై వచ్చి మరీ…!!
- Author : hashtagu
Date : 27-10-2022 - 9:19 IST
Published By : Hashtagu Telugu Desk
స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు డేరా బాబా పెరోలో పై బయటకు వచ్చిన తర్వాత..దీపావళి రాత్రి మ్యూజిక్ వీడియోు రిలీజ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పెరోల్ పై రిలీజ్ అయి ఇలాంటి ప్రచార హంగామా చేయవచ్చా లేదా అనేది పక్కన పెడితే…యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆడియోకి 24 గంటల్లో రికార్డు వ్యూస్ వచ్చాయి.
మొదటిరోజు రికార్డు స్థాయిలో 42 లక్షల వ్యూస్ వచ్చాయి. పెరోల్ పై వచ్చిన బాబా కేవలం అంతటితో ఆగలేదు. జైలు నుంచి వచ్చిన ప్రతిసారి చేసినట్లుగానే ఈ సారి కూడా ఆన్ లైన్ లో సత్సంగాలు చేశారు. పలువురు బీజేపీ నేతలు ఈ సత్సంగాలకు హాజరవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
‘Sadi Nit Diwali’ అనే పేరుతో దీపావళికి యూట్యూబ్ లో విడుదల చేయగానే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. అమెరికా, బ్రిటన్ తరహాలోనే ఇక్కడ కూడా పెరోల్ రిజిస్ట్రేషన్ ను కోడిఫైడ్ చేయాలంటూ ట్వీట్ చేశారు. చట్టాన్ని మార్చాల్సిన సమయం అసన్నమైందన్నారు.