Shocking Incident : లక్ అంటే వీడిదే…భూమ్మీద ఇంకా నూకలున్నాయ్..!!
- Author : hashtagu
Date : 28-10-2022 - 7:42 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని అకోలాలోని వివ్రా గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మరణించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తరలించారు. శ్మశానవాటికలో చివరి తంతు నిర్వహిస్తుండగా…ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఈ ఘటనను చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అకోలాలని వివ్రా గ్రామానికి చెందిన 25ఏళ్ల ప్రశాంత్ మెస్రే హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు తెలపడంతో…అతని కుటుంబంలో విషాదం నెలకొంది. అంత్యక్రియల నిమిత్తం ప్రశాంత్ మ్రుతదేహాన్ని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించారు.
అయితే ప్రశాంత్ ఒక్కసారిగా లేవడంతో అక్కడున్న జనం, కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. దీంతో ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా షాకింగ్ గు గురి చేసింది. వీడికి ఇంకా భూమ్మీదా నూకలు మిగిలే ఉన్నాయి. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు అంటున్నారు.
అయితే ఇందులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇది అమ్మవారి అద్భుతమని తాంత్రికుడు దీపక్ బోర్లే వల్లే తమ కుమారుడు బతికాడని యువకుడి తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఘటనపై గ్రామస్థలు మాట్లాడుతూ…ఇది మోసపూరితమైందని…మూడనమ్మకం అని అన్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.