Aadhaar Card For Dogs : ముంబైలో కుక్కలకూ “ఆధార్”.. క్యూఆర్ కోడ్ తో ఐడీ కార్డ్స్
Aadhaar Card For Dogs : 'ఆధార్' కార్డు.. మనుషుల గుర్తింపు కోసం !!మరి నిత్యం మనుషుల మధ్యే .. మనుషులతోనే కలిసి జీవించే కుక్కల పరిస్థితి ఎలా ?
- Author : Pasha
Date : 16-07-2023 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Aadhaar Card For Dogs : ‘ఆధార్’ కార్డు.. మనుషుల గుర్తింపు కోసం !!
మరి నిత్యం మనుషుల మధ్యే .. మనుషులతోనే కలిసి జీవించే కుక్కల పరిస్థితి ఎలా ?
ఈ ఆలోచన ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ కు వచ్చింది..
దీనికి అక్షయ్ ఒక పరిష్కారాన్ని రెడీ చేశారు.
ఆధార్ కార్డులో మనుషుల వివరాలను, బయో డేటాను, అడ్రస్ ను ఎలాగైతే ఎంటర్ చేస్తారో.. అదే విధంగా వీధి కుక్కల వివరాలతో డిజిటల్ క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులను ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ రెడీ చేశారు. ఈ గుర్తింపు కార్డులను తొలి విడతగా ముంబై విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న 20 వీధి కుక్కల మెడలో వేశారు. ఆ కుక్కలు ఉండే ఏరియా వివరాలు, వయసు సమాచారం, సంతానం కలుగకుండా స్టెరిలైజేషన్ చేశారా లేదా అనే సమాచారం, టీకాలు వేసిన వివరాలు, కుక్క తప్పిపోయినప్పుడు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్లు ఈ కార్డులో నమోదై ఉంటాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఒక క్యూఆర్ కోడ్ గా(Aadhaar Card For Dogs) మార్చారు. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే .. కుక్కకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ప్రత్యక్షం అవుతాయి.
Also read : Healthy Seeds: ఈ విత్తనాలు తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు..!
ముంబై నగరంలోని వీధి కుక్కలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా త్వరలో లొకేషన్ ఆప్షన్ ను కూడా ఈ ఐడీ కార్డులకు జతపరుస్తామని ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ వెల్లడించారు. ‘pawfriend.in‘ పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్ సైట్ లో తాము ఐడీ కార్డులు ఇష్యూ చేసిన వీధి కుక్కల వివరాలు పొందుపరిచామని పేర్కొన్నారు. ఐడీ కార్డులు వేసే క్రమంలోనే ఆ 20 కుక్కలకు టీకాలు కూడా వేయించామని చెప్పారు. బాంద్రా వాసి సోనియా షెలార్ ముంబైలో దాదాపు 300 వీధి కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నారు. ఈక్రమంలో ఆమె ముంబై మున్సిపల్ కారొరేషన్ కు చెందిన పశువైద్యుడు డా. కలీమ్ పఠాన్, ‘pawfriend.in‘ సభ్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఆ డాగ్స్ కు టీకాలు వేయిస్తున్నారు. వాటికి ట్యాగింగ్ చేయిస్తున్నారు.