Husband Kiss: ముద్దు పెట్టుకున్నందుకు విడాకులు ఇచ్చేసిన భార్య
అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. ఇంకేముంది ఆనందంలోనో, భార్య మీద ప్రేమతోనే అందరి ముందు ముద్దు పెట్టాడు ఓ భర్త.
- By Balu J Published Date - 05:58 PM, Thu - 1 December 22
అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. ఇంకేముంది ఆనందంలోనో, భార్య మీద ప్రేమతోనే అందరి ముందు ముద్దు పెట్టాడు ఓ భర్త. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ, భార్య మాత్రం ఏకంగా ఆ భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో జరిగింది. నవంబర్ 26న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 28వ తేదీన పావసా గ్రామంలో భారీగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు. స్టేజ్ పై నూతన వధూవరులు కూర్చున్నారు.
అయితే సడెన్ గా తన భార్యను ముద్దుపెట్టుకున్నాడు భర్త. ఊహించని ఈ పరిణామానికి భార్య షాక్ అయింది. ఆ వెంటనే కోపం తెచ్చుకుంది. వెంటనే స్టేజ్ దిగి చకచకా తన గదిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. బంధువులు నచ్చజెప్పినా వినలేదు. వందలాది మంది మధ్య తన పర్మిషన్ లేకుండా ముద్దాడిన భర్త క్యారెక్టర్ ను ఆమె అనుమానించింది. తన భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, విడాకులకు అప్లయ్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
Related News
Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్
Taj Mahal: తాజ్‌మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాద�