22 Snakes Caught: మహిళ బ్యాగ్ లో 22 పాములు.. వీడియో వైరల్
ఓ మహిళ బ్యాగులో 22 పాములు, ఒక ఊసరవెల్లి పట్టుబడడంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
- By Balu J Published Date - 11:07 AM, Mon - 1 May 23

మనుషులే (People) కాదు.. జంతువులు (Animals) సైతం అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో జంతువులు, పాములు (Snakes) సైతం రావాణా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ దగ్గర నుంచి 22 పాములు పట్టుబడ్డాయి. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ మహిళ బ్యాగులో 22 పాములు (Snakes), ఒక ఊసరవెల్లి పట్టుబడడంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఆ మహిళ వ్యవహారశైలి అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆమె లగేజీని తనిఖీ చేశారు. అందులో చిన్న పాములు (Snakes), ఊసరవెల్లి కనపడటంతో దిగ్భ్రాంతి చెందారు.
Also Read: Hyderabad: జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద కరెంట్ షాక్తో కానిస్టేబుల్ఒకరు మృతి