Favorite Drink: మీకిష్టమైన పానీయం ద్వారా మీ వ్యక్తిత్వ పరీక్ష..!
మీ కోరికలు, మీ ఎంపికలు, ప్రాధాన్యతలు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
- Author : hashtagu
Date : 15-11-2022 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
మీ కోరికలు, మీ ఎంపికలు, ప్రాధాన్యతలు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీరు తీసుకునే పానీయాల ద్వారా మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం ద్వారా మీరు ఏమిటో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే, మీ బలాలు, మీ బలహీనతలు, మీ జీవితంలో జరిగిన సంఘటనలకు స్పష్టమైన కారణాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటనలను కూడా రోజూ మీరు తీసుకునే సాధారణ టీ, కాఫీ లాంటి పానీయాలు కూడా తెలియజేస్తాయి. అందువల్ల మీరు టీ, కాఫీ, గ్రీన్ టీ, వైన్ లేదా మోజిటో లాంటి పానీయాలలో దేనిని ఎక్కువగా ఇష్టపడతారో తెలిస్తే అది మీ వ్యక్తిత్వం గురించి ఏమి చెబుతుందో తెలుసుకోవచ్చు. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్ధాం.
1. టీ ఇష్టపడేవారు: టీని ఇష్టపడే వ్యక్తులు అస్తవ్యస్తంగా, గజిబిజిగా, గందరగోళంగా ఉండే కార్యకలాపాల కంటే శాంతియుత కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరు సర్ ప్రైజ్ లను ఇష్టపడరు. ముందుగా నిర్ణయించుకున్న దినచర్యకు కట్టుబడి ఉంటారు. వారు ఒక కప్పు టీతో సుదీర్ఘ సంభాషణలను ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వీరి బంధం దృఢంగా ఉంటుంది.
2. కాఫీ ఇష్టపడేవారు: కాఫీ ప్రేమికులు తమ కాఫీని ఎలా ఇష్టపడతారు అనే దాని ఆధారంగా వారిని కొన్ని కేటగిరీలుగా విభజించవచ్చు. బ్లాక్ కాఫీ తాగేవారు చాలా సహనం కలిగి ఉంటారు. కాపుచినో ఇష్టపడే వారు చాలా సృజనాత్మకంగా, నిజాయితీగా, అధునాతనంగా ఉంటారు. అలాగే వారు చాలా ఓపెన్ మైండ్ తో ఉంటారు. ఎస్ప్రెస్సో తాగేవారు ధైర్యంగా ఉంటారు. లాట్టే ను ఎంచుకునే వారు నమ్మకస్తుడిగా, సమస్యలకు భయపడని వ్యక్తిగా ఉంటారు.
3. గ్రీన్ టీ ఇష్టపడేవారు: గ్రీన్ టీ ఇష్టపడే వ్యక్తి ఆచరణాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. హేతుబద్ధంగా ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేయడానికి ఇష్టపడతారు. చిన్న చిన్న వాటికి విసుగు చెందరు. కొద్దిమంది స్నేహితులు మాత్రమే ఉంటారు. ప్రకృతితో అనుబంధం కలిగి భావోద్వేగాలను సమతౌల్యం చేస్తూ నియంత్రణలో ఉంచడానికి ఇష్టపడతారు. వీరు మంచి శ్రోతలు అని చెప్పవచ్చు.
4. వైన్ ఇష్టపడేవారు: వైన్ తాగేవారు ఆశావాదంతో ఉంటారని చెప్పవచ్చు. చాలా సోషల్ గా ఉంటారు. స్నేహితులతో సమావేశాన్ని ఇష్టపడతారు. సులువుగా స్నేహం చేసుకోవడంలో సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు సినిమా, షికార్లకు వెళ్లడం కంటే ప్రశాంతంగా వైన్ తాగి, తమ హృదయాన్ని విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండే విందుకు వెళ్లడానికి ఇష్టపడతారు. వీరు గాసిప్స్ ను కూడా బాగా ఇష్టపడతారు.
5. మోజిటో ఇష్టపడేవారు: మోజిటో తాగేవారు సాహసాలను ఇష్టపడతారు. వీరు తమ జీవితాల్ని ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు. జీవితం నుంచి నేర్చుకోవడాన్ని బాగా ఇష్టపడతారు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ఒక మానసిక సంసిద్దత కలిగి ఉంటారు. పెద్ద పెద్ద కలలు కంటారు. కలలను నెరవేర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు. వీరు తమ ఎంపికల పట్ల స్పృహ కలిగి ఉంటారు. వీరు తమ జీవితంపై నియంత్రణ కోల్పోవడానికి అసలు ఇష్టపడరు.