HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Worst Food Which Can Raise You Cholesterol Levels

High Cholesterol Worst Food: బ్యాడ్ కొలెస్ట్రాల్ కు.. గుడ్ బై చెప్పేయండిలా !

అధిక కొలెస్ట్రాల్ గండంలా చుట్టుముడుతోంది. ఎన్నో వ్యాధులు ముసురుకోవడానికి కారణభూతం అవుతోంది.

  • By Hashtag U Published Date - 06:45 AM, Mon - 8 August 22
  • daily-hunt
Cholestrol
Cholestrol

అధిక కొలెస్ట్రాల్ గండంలా చుట్టుముడుతోంది. ఎన్నో వ్యాధులు ముసురుకోవడానికి కారణభూతం అవుతోంది. తీవ్రమైన గుండెజబ్బులకు, స్థూలకాయం, అలాంటి ఇతర వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం.
కొలెస్ట్రాల్ పెరగకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయగలిగితే.. ఎన్నో వ్యాధుల నుంచి ముందస్తు రక్షణ పొందొచ్చు. ఈక్రమంలో మీరు తీసుకునే ఆహార పదార్థాలపై ప్రధాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి ఫుడ్స్ ను దూరంగా పెట్టాలనేది కూడా గ్రహించాలి. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం..

ఉదాహరణకు..

పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్య కరమైనవి. కానీ అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలోనివి ఆరోగ్యానికి మంచివి. అందుకని మీ డైట్ కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

మాంసపు పదార్థాలు..

గోమాంసం, పందిమాంసం వంటి మాంసాలు తినటం వలన కొలెస్ట్రాల్ మరింత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు దాని బదులు సన్నని మాంసాలైన చికెన్, సముద్రపు ఆహారం వంటి తీసుకోండి.

లో కాల్షియం డైట్

కాల్షియం చాలా ముఖ్యమైన పోషక లవణం. కాల్షియం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించటంలో సాయపడుతుంది. అందుకని మీరు కాల్షియం ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, గుడ్లు వంటివి తీసుకోవాలి. లేదంటే మీ కొలెస్ట్రాల్ సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది.

బేకరీ ఫుడ్స్..

కేకులు, తెల్ల బ్రెడ్ వంటి పదార్థాలను తినడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ బేకరీ ఉత్పత్తులు అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార, ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారు చేస్తారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతుంటే వీటికి దూరంగా ఉండటం మంచిది.

తక్కువ పీచు పదార్థాల డైట్

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఫైబర్‌ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తనాళాల్లో పూత తయారవ్వకుండా తొలగిస్తుంది. అందుకని మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు, పండ్లు, ఆకు కూరలు వంటివి ఉండే విధంగా చూసుకోవాలి.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె లో ఉండే ఫ్యాట్స్ కూడా అధిక కొలెస్ట్రాల్ కు కారణం అవుతాయి. ఇందులో 90 శాతం సాచ్యురేటెడ్ కొవ్వు ఉంటుంది. దీనివల్ల hdl, ldl అనే రెండు రకాల కొవ్వులు శరీరంలో ఏర్పడుతాయి. కొబ్బరి నూనెను వంటకాల్లో వాడే వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ ఉంటుంది.

మద్యపానం

ఆల్కహాల్ లో అనారోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.
అది మీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మరింత పెంచివేస్తుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గడం..

అధిక కొలెస్ట్రాల్, అధిక శరీర కొవ్వు వంటివి పలు వ్యాధులకు కారణమవుతాయి. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం మీరు బరువు, శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోవడం మంచిది.

మానసిక ఒత్తిడి

ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.

కొలెస్ట్రాల్‌లో రెండు ప్రధాన రకాలు..

కొలెస్ట్రాల్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి హై- డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL), మరొకటి లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL). లిపోప్రొటీన్లు కొవ్వు, ప్రోటీన్ల కలయికతో ఏర్పడతాయి. లిపిడ్లు ప్రోటీన్లకు జతకలిసి రక్తం ద్వారా కదులుతాయి. ఇలా కొలెస్ట్రాల్ శరీర భాగాలకు వెళ్తుంది. HDLను “మంచి కొలెస్ట్రాల్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కాలేయానికి కొలెస్ట్రాల్‌ను రవాణా చేస్తుంది. కాలేయంలో తయారైన కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది. HDL మీ శరీరంలోని ఇతర భాగాల నుంచి కాలేయానికి తిరిగి కొలెస్ట్రాల్‌ను తీసుకువెళుతుంది. తర్వాత కాలేయం శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇలా HDL శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది ధమనులలో చేరే అవకాశం తక్కువ.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cholesterol
  • high cholesterol
  • worst food

Related News

Hdl

‎HDL: ఈ 5 రకాల ఫుడ్స్ మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని మీకు తెలుసా?

‎HDL: ఇప్పుడు తెలుసుకోబోయే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని చెబుతున్నారు. వీటిని తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.

    Latest News

    • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

    • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

    • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

    • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

    • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd