Winter Care: చలికాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Winter Care: చలికాలంలో వచ్చే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలను పాటిస్తే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Thu - 30 October 25
Winter Care: చలికాలం వచ్చింది అంటే చాలు చల్ల గాలుల కారణంగా చర్మం పొడిబారడం, పెదవులు పగలడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తక్కువ తేమ, ఎండ లేకపోవడం వల్ల చర్మం సులభంగా నీరసం పొందుతుంది. ఈ పరిస్థితుల్లో చర్మానికి సరైన తగిన సంరక్షణ అవసరం. అయితే కొన్నిసార్లు ఈ చలికాలంలో చర్మం పొడిబారి మంటగా అనిపించడం లేదంటే పెదవులు పగిలి రక్తం రావడం వంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే చలికాలంలో ఈ సమస్యలు ఇబ్బంది పెట్టకూడదు అంటే ఏం చేయాలో,ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో తక్కువ హార్ష్ కెమికల్స్ ఉండే ఫేస్‌వాష్ ఉపయోగించడం మంచిది. వేసవిలో మనం ఎక్కువ నురగ కలిగిన క్లెన్సర్ లను ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఇవి చర్మాన్ని మరింత పొడిగా చేస్తాయట. కాబట్టి సున్నితమైన, SLS ఫ్రీ క్లెన్సర్ వాడితే చర్మం మృదువుగా ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో టోనర్ చర్మం హైడ్రేషన్ లో కీలక పాత్ర పోషిస్తుందట. టోనర్ లో హ్యూమెక్టెంట్లు ఉంటాయని, ఇవి చర్మానికి తేమను అందిస్తాయని, టోనర్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే, తేమ ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంటుందని, ఇది చర్మం పొడిగా మారకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.
కాగా తేమను అందించడంలో మాయిశ్చరైజర్ కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ చలికాలంలో హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వాడటం చాలా ముఖ్యమైంది. లైట్ క్రీములకంటే కాస్తా మంచిగా ఉండే మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం మంచిది. ఉదయం, రాత్రి రెండు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని, చర్మం పొడిబారడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. చలికాలంలో ఎండ తక్కువగా కనిపించినా, యూవీ కిరణాలు చర్మానికి హానికరమే. రోజూ SPF 30 లేదా అంతకన్నా ఎక్కువ గల సన్‌స్క్రీన్ ను ఉపయోగించడం వల్ల చర్మం పిగ్మెంటేషన్, నల్లటి మచ్చల నుంచి రక్షించబడుతుందట. సన్‌స్క్రీన్ తో చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుందట. చలికాలంలో మనకు దాహం తక్కువగా వేస్తుంది. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే చర్మం పొడిబారి మృతకణాలతో నిండి ఉంటుంది.
కాబట్టి కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం వల్ల తగిన తేమను అందిస్తుందట. అయితే చలికాలంలో వీటిని పాటించడంతోపాటు మరికొన్ని చిట్కాలు పాటించాలట. చల్లని నీటితో కాకుండా కాస్త గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే వారానికి ఒకసారి చర్మంపై మృతకణాలను తొలగించేందుకు తేలికపాటి స్క్రబ్ వాడడం మంచిదని చెబుతున్నారు. చలికాలంలో పెదాలు పొడిగా ఉండటానికి ట్యుట్రస్ స్టిక్ లేదా లిప్ బామ్ ఉపయోగించడం మంచిదట. తేలికపాటి ఆహారం తీసుకోవడం చర్మానికి మంచిదట. చల్లగాలులకు చర్మాన్ని కాపాడటానికి షాల్స్ లేదా మఫ్‌లర్ ధరించడం అవసరం అని చెబుతున్నారు. కాగాఈ చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో చర్మానికి తగినంత సంరక్షణ అందుతుందట.