Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!
- By Vamsi Chowdary Korata Published Date - 10:37 AM, Wed - 1 October 25

సింధూరం పెట్టగానే వారికి పెళ్ళి అయిందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది. అందుకే, పెళ్లి కాగానే చాలా మంది పాపిట్లో కుంకుమ పెడుతుంటారు. వారికి అందాన్ని తీసుకురావడమే కాకుండా, మన సాంప్రదాయం కూడా. ఎంత మంది ఫ్యాషన్‌గా రెడీ అయినా కూడా పాపిట్లో సింధూరం పెట్టడం మరవట్లేదు. దీని వల్ల వారి అందం పెరుగినట్లుగా ఫీల్ అవుతారు. దీనిని ఎక్కువసేపు అలానే ఉండి అటు ఇటు చెదరకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీని వల్ల చాలాసేపటి వరకూ కుంకుమ అలానే ఉంటుంది. చూడ్డానికి కూడా చక్కగా కనిపిస్తుంది. పైగా మీరు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. అటు ఇటుగా కాకుండా ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పాపిట్లోకి కుంకుమ పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనిని ఎక్కువసేపు ఉండేలా కనిపించాలంటే కొన్ని కిటుకులు ఫాలో అవ్వాల్సిందే.
పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఎక్కడ్నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. ఆ తర్వాత కుంకుమని అక్కడ అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు టిష్యూ పేపర్ అడ్డు పెట్టండి. దీంతో ముఖంపై పడకుండా ఉంటుంది. ఒకే విధంగా, చక్కగా సింధూర్ ఉండిపోతుంది. చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది. ఇటుఇటు అవ్వదు. కొద్దిగా రాస్తే సరిపోతుంది. తర్వాత అదే టిష్యూతో కొద్దిగా ప్రెస్ చేయండి. దీంతో ఎక్స్‌ట్రా కుంకుమ కిందకి పడదు.
మీ దగ్గర పెట్రోలియం జెల్లీ లేకపోతే ఏదైనా క్రీమ్ కూడా రాయొచ్చు. మొత్తానికీ కాస్తా ఆయిలీగా ఉండాలి. అయితే, దీనిని ఎక్కువగా రాయొద్దు. ఎందుకంటే మరీ జిడ్డులా మారుతుంది. కొద్దిగా రాసి ఆ తర్వాత కుంకుమని మెల్లిగా అప్లై చేయండి. తర్వాత ముందు చెప్పినట్లుగానే ప్రాసెస్ రిపీట్ చేయండి. దీంతో బొట్టు సరిగ్గా ఉంటుంది. అటు ఇటు చెదిరిపోదు. ఎక్కువసేపు అలానే ఉంటుంది. కుంకుమ ఎక్కువైనా కాస్తా టిష్యూత్ ట్యాప్ చేయండి. దీంతో ఎక్స్‌ట్రా కుంకుమ వచ్చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్యలు ఉండకుండా ఉండేందుకు సింధూర్ స్టిక్స్ వాడుతుంటారు. పెన్సిల్స్ వాడుతుంటారు. వాటిని వాడేటప్పుడు ఎక్స్‌పైరీ కాకుండా చూసుకోండి. దీని వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని వాడేముందు ఓ సారి చెక్ చేసి వాడడం మంచిది.