Vasthu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఎటువంటి జంతువులు పెంచుకోవాలలో తెలుసా?
చాలామంది ఇంట్లో అనేక రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు వారికి ఇష్టమైన
- By Nakshatra Published Date - 06:00 AM, Sun - 13 November 22
చాలామంది ఇంట్లో అనేక రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు వారికి ఇష్టమైన జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి కొందరు పిల్లులు పెంచుకుంటే మరి కొందరు కుక్కలు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ జంతువులను పక్షులను పెంచుకోవడంలో కూడా వాస్తు విషయాలను పాటించాలి అని చాలామందికి తెలియదు. మరి వాస్తు ప్రకారం గా మనం ఎటువంటి జంతువులను ఇంట్లో పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారంగా పెంపుడు జంతువులు మన పర్యావరణం నుండి ప్రతికూల శక్తిని తొలగించడంతో పాటు వాస్తు దోషాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
ఇంట్లో మొక్కలు చెట్లు తరువాత అంత సానుకూలతను పెంచేవి జంతువులు మాత్రమే అని చెప్పవచ్చు. కాగా కుటుంబ సభ్యుల మధ్య మంచి భావోద్వేగ సమతుల్యతను ఏర్పాటు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. కాగా కొన్నిరకాల పెంపుడు జంతువులు అదృష్టం, శాంతిని కూడా అందిస్తాయి. మరి వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన అదృష్ట జంతువులు ఏమిటి అన్న విషయానికి వస్తే..కుక్కలు, ఆవులు, కుందేళ్లు, గేదెలు, గుర్రాలు, చిలుకలు, చేపలు ఉత్తమ పెంపుడు జంతువులు. కుందేళ్లు గొప్పదనాన్ని అందిస్తాయి. పావురాలను పెంచుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆవులను హిందూ మతంలో పూజిస్తారు అన్న విషయం తెలిసిందే.
కుక్కను పెంచుకోవడం కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. కుక్కను పెంచడం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. చేపలు నీటిలో కదలడం ద్వారా ఇంటికి సానుకూల శక్తిని తెస్తాయి. చేప మంచి ఆరోగ్యాన్ని , శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. పెద్ద సంఖ్యలో చేపలు కుటుంబానికి మేలు చేస్తాయి. గుర్రాలు బలం, ప్రతిష్టకు చిహ్నాలు. గుర్రాలను కలిగి ఉన్న వ్యక్తులు విజయవంతమైన వృత్తిని, ఆహ్లాదకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు.
Related News
Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?
మన వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిం