Honey for acne: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే తేనెతో ఇలా చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా బాధపడుతున్న సమస్యలలో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ మొటిమల సమస్య కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బం
- Author : Anshu
Date : 11-12-2023 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా బాధపడుతున్న సమస్యలలో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ మొటిమల సమస్య కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ముఖం నిండా మొటిమలు వచ్చి గుంతలు ఏర్పడి ముఖం మొత్తం మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. దీంతో నలుగురు లోకి వెళ్ళాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొటిమల సమస్యకు తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.
మరి తేనెతో ఒక మొటిమలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా తేనెలో 7 రకాల అమైనో యాసిడ్స్, 10 ఖనిజాలు, విటమిన్ సి, బి కాంప్లెక్స్, నేచురల్ ఎంజైమ్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్మానికి మంచి చేస్తాయి. దీనిని వాడితే చాలా వరకూ సమస్య తగ్గుతుంది. ఇందుకోసం బొప్పాయి గుజ్జులో తేనె కలపి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అలానే 30 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. బొప్పాయి, తేనె మిశ్రమాలు చర్మంపై ఉన్న సమ్యలు తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. అలాగే తేనె త్రిఫల రెండింటిని మిక్స్ చేసి మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి.
30 నిమిషాల పాటు ఉంచి, గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేస్తే మొటిమల సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అదేవిదంగా తేనెని, నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇలా తరచుగా చేస్తే మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మొటిమలపై నేరుగా తేనెని రాయండి. దీనిని 20 నుంచి 30 నిమిషాల పాటు అలానే ఉంచి,తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీనిని మొటిమల సమస్య తగ్గేవరకూ రోజుకి రెండు సార్లు అయిన చేయవచ్చు. అలాగే తేనె అలోవెరా రెండు కూడా చర్మానికి మేలు చేసేవే. ఈ రెండింటి కలయిక చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చల వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే చాలా వరకూ మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతాయి. అయితే, వీటిని క్లీన్ చేసినప్పుడు సబ్బు, ఫఏస్ వాష్ వాడకపోవడమే మంచిది.