Health Tips: భోజనం తరవాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. గుండె పోటు సమస్య రమ్మన్నా రాదు.. ఏం చేయాలంటే?
Health Tips: గుండెపోటు రాకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న గారు ఇప్పుడు చెప్పినట్టుగా భోజనం చేసిన తర్వాత ఒక్క పని చేస్తే చాలు గుండెపోటు సమస్య రాదు అని చెబుతున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Thu - 23 October 25

Health Tips: ఇటీవల గుండెపోటుతో మరణించే వారి పెరిగిన విషయం తెలిసిందే. అయితే రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. వైద్యులు ఎన్ని రకాల సూచనలు చేసినా కూడా చాలామంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహిస్తూనే ఉన్నారు. దీని కారణంగా గుండెపోటు వంటి పెద్ద పెద్ద సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలా గుండె పోటు సమస్యలు రాకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఒకే ఒక్క అలవాటుతో ఈ ముప్పు నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అదేమిటంటే.. భోజనం చేసిన తరవాత వాకింగ్ చేయడం. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. కొలెస్ట్రాల్ తగ్గడం నుంచి బీపీ, షుగర్ తగ్గడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లలో మార్పులతోనే చాలా వరకూ గుండె సమస్య నుంచి తప్పించుకోవచ్చట. రోజూ భోజనం చేసిన తరవాత కనీసం ఒక పావుగంట పాటు అయినా నడిస్తే గుండెను భద్రంగా కాపాడుకోవచ్చట. మూడు పూటలా ఇది అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ ఒక్క అలవాటులో 40 శాతం మేర గుండెపోటు ముప్పు తగ్గించుకోవచ్చట.
అయితే మాములుగా ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకు గల కారణం. ఆహారంలోని కార్బొహైడ్రేట్స్ గ్లూకోజ్ లా మారిపోవడం. ఈ గ్లూకోజ్ నుంచి శక్తి అందుతుందట. ఎప్పుడైతే బ్లడ్ లో షుగర్ మరీ తీవ్రంగా ఉంటుందో ఇది ఇన్ ఫ్లమేషన్ కి దారి తీస్తుందని,ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుందని, ధమనులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయట. రక్త సరఫరా సరిగ్గా అవ్వదట. క్రమంగా ఇది గుండె జబ్బులకు దారి తీస్తుందని చెబుతున్నారు. కప్పు రైస్ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయట.
చాలా సైలెంట్ గా జరిగే ఈ ప్రక్రియ గుండెపోటుకు దారి తీస్తుందని, రోజూ ఇలా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుందట. ఎప్పటి కప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకునే విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలట. లేదంటే హార్ట్ అటాక్ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. టిఫిన్ లేదా భోజనం చేసిన తరవాత కనీసం 15 నిముషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో మార్పులు జరుగుతాయట. వాకింగ్ చేసినప్పుడు శరీరంలో పెరిగిన గ్లూకోజ్ అంతా త్వరగా కరిగిపోతుందని, ఇన్సులిన్ అవసరం మేర ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోతుందని మెటబాలిజం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు హై బ్లడ్ షుగర్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చట.