Beauty Tips: ఒక్క రాత్రిలోనే ముఖం మెరిసిపోవాలా.. అయితే కలబందలో వీటిని కలిపి రాయాల్సిందే!
ముఖం అందంగా మారి మెరిసిపోవాలి అంటే కలబందలో ఇప్పుడు చెప్పేవి కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల రాత్రికి రాత్రే ముఖం మెరిసిపోవడం ఖాయం అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:00 AM, Sun - 4 May 25

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కలబంద ఆరోగ్యానికి అలాగే అందానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అందం కోసం కలబందను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కలబందతో తయారుచేసిన ఫేస్ క్రీములు, సోపులు వంటి బ్యూటీ ప్రోడక్ట్ లు మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే కలబందన ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినియోగిస్తూ ఉంటారు. కలబందను తరచుగా వినియోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. చర్మ సమస్యలు దూరం అయ్యి అందం మరింత పెరుగుతుందట.
అయితే కలబంద ఉంది కదా అని దానిని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం కాదు దానిలో కొన్ని పదార్థాలు అదనంగా కలిపి ముఖానికి రాయడం వల్ల మనం సహజంగా అందంగా మెరిసిపోవచ్చని చెబుతున్నారు. మరి వేటితో కలిసి కలబంద గుజ్జు రాయడం వల్ల మన ముఖం రాత్రికి రాత్రే అందంగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలబంద జెల్ తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలట. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఒకటి స్పూన్ కలబంద గుజ్జులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి కనుబొమ్మలకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
చర్మంలో ఉండే మలినాలు తొలగిపోవాలి అంటే ముల్తానీ మట్టి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై ఉండే జిడ్డు తగ్గిపోవడానికి ముల్తాని మట్టిలో కొద్దిగా అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుందట. మెడ భాగంకి కూడా అప్లై చేయవచ్చని చెబుతున్నారు.
రోజ్ వాటర్ కూడా అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చడం కోసం రెండు చెంచాల రోజు వాటర్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలట. ఈ ప్యాక్ ని ముఖం, మెడ బాగానికి అప్లై చేయాలట. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా అలోవెరా జెల్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ రెండు బాగా కలిపి మఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ఆ మంగు మచ్చలు తొలగిపోవడంతో పాటు నల్లటి వలయాలు చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు