Home Remedy : మీ జుట్టు గడ్డిలాగా ఉందా ? ఈ ఒక్క చిట్కాతో స్మూత్ గా చేసుకోండిలా
ఒక మిక్సీ జార్ లో అరటిపండు గుజ్జు, కోడిగుడ్డు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం, కొబ్బరి నూనె..
- Author : News Desk
Date : 09-10-2023 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
Home Remedy : ఆడపిల్లలుగా పుట్టిన వారెవరికైనా సరే.. జుట్టు అందంగా, పొడవుగా, లావుగా, స్మూత్ గా పట్టుకుచ్చులా ఉండాలని కోరుకుంటారు. కానీ.. రసాయనాలతో కూడిన వివిధ రకాల షాంపూలు, రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు అందాన్ని కోల్పోతుంటారు. కొందరైతే హెయిర్ స్మూత్ గా, సిల్కీగా ఉండాలని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ ఒక్క చిట్కా మీ ఇంట్లోనే పాటిస్తే.. మీకు ఇకపై బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఏంటి ఆ చిట్కా అనుకుంటున్నారా ? తెలుసుకుందాం.
ఈ చిట్కా పాటించేందుకు కావలసిన పదార్థాలు
అరటి పండు -ఒకటి
కోడి గుడ్డు – ఒకటి
నిమ్మరసం – అరచెక్క
కొబ్బరినూనె – 2 టీ స్పూన్లు
విటమిన్ ఇ క్యాప్సుల్ – ఒకటి
తయారీ విధానం..
ఒక మిక్సీ జార్ లో అరటిపండు గుజ్జు, కోడిగుడ్డు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం, కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సుల్ వేసి 10 నిమిషాల పాటు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ బాగా పట్టించాలి. 10 నిమిషాల పాటు మర్దనా చేసుకుని ఆరనివ్వాలి. జుట్టుకు పట్టించిన మిశ్రమమంతా ఆరిన తర్వాత.. రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలంటుకోవాలి. అనంతరం హెయిర్ సీరమ్ అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మృదువైన, పట్టుకుచ్చులాంటి జుట్టు మీ సొంతమవుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. 2 వారాల్లోనే మీ జుట్టులో మార్పును గమనించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ఈ చిట్కా మీ ఇంట్లోనే ట్రై చేసి చూడండి.
Also Read : Chakkera Pongali Recipe : చక్కెరపొంగలి ఇలా చేస్తే.. అస్సలు వదలరు