Long Journeys: దూరపు ప్రయాణంలో స్త్రీలకు టాయిలెట్ సమస్య..!
దూరం ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో ప్రతి స్త్రీ ఎదుర్కుంటున్న సమస్య టాయిలెట్ (Toilet).
- Author : Maheswara Rao Nadella
Date : 05-12-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
Long Journeys: దూరం ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో ప్రతి స్త్రీ ఎదుర్కుంటున్న సమస్య టాయిలెట్ (Toilet). తొందరగా గమ్యాన్ని చేరుకుని మూత్ర విసర్జనకు సిద్ధం కావాలే తప్ప, స్త్రీలకు సంబంధించి టాయిలెట్ (Toilet) సౌకర్యాలు తక్కువే. అయితే తరచుగా మూత్రాన్ని నియంత్రించడం వల్ల అనేక అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పటికప్పుడు కాకాపోయినా దీర్ఘకాలంలో ఈ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. ఎక్కువగా మహిళల విషయంలో వాష్ రూమ్‌కి వెళ్ళాలనే ఆలోచనను ఆపుకుంటూ, మూత్రాశయాన్ని నియంత్రించడం ఆరోగ్యకరమైనది కాదు.
ఎలాంటి హానిని కలిగిస్తాయంటే:
- అనుమానం కలిగితే 2-3 గంటలకు ఒకసారి మూత్రాశయాన్ని ఖాళీ చేయడం వల్ల చాలా రకాల మూత్రాశయ రుగ్మతలను, ఇబ్బందులను నివారించవచ్చు.
- దూర ప్రయాణం (Long Journeys) లో మూత్ర విసర్జనను ఆపుకోవడం తప్పసరి కావచ్చు, కాకపోతే ఇదే అలవాటును అస్తమానూ చేయడం వల్ల విసర్జనకు ఆటంకం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌లు వస్తాయి.
- రోజుకు 10 -12 గ్లాసులతో లేదా 2 ½ – 3 లీటర్ల ద్రవాలతో హైడ్రేట్ అవుతున్నారని తెలుసుకోవాలి. రోజులో సూప్‌లు, జ్యూస్‌లు కూడా
లిక్విడ్స్ స్థానంలో తీసుకోవడం - టీ, కాఫీ, కోలా వంటి కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.
- ధూమపానం మానేయండి: ధూమపానం రక్తనాళ సంకోచం (Vasoconstriction) కు దారి తీస్తుంది, మూత్రాశయ చికాకు కారణంగా మూత్ర విసర్జన ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది.
- పెల్విక్ ఫ్లోర్ (Pelvic Floor) వ్యాయామాలు, కెగెల్ (Kegel) వ్యాయామాలు మూత్రాశయానికి మద్దతు ఇచ్చే పెల్విక్ ఫ్లోర్‌ను బలోపేతం
చేయడానికి సహకరిస్తాయి. - అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, దీర్ఘకాలిక మలబద్ధకం పెల్విక్ ఫ్లోర్‌పై ఒత్తిడిని కలిగిస్తాయి, ఇది కండరాల బలహీనత, మూత్రం లీక్‌కు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన బరువుతో పెల్విక్ ఫ్లోర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read: Vitamin B-12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెప్పేస్తుంది!