Kashmiri Mushrooms : ‘కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగు’ ఎందుకంత ఖరీదు ? స్పెషాలిటీ ఏమిటి ?
Kashmiri Mushrooms : అది అలాంటి ఇలాంటి పుట్టగొడుగు కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగు’.
- By Pasha Published Date - 06:14 PM, Sat - 28 October 23
Kashmiri Mushrooms : అది అలాంటి ఇలాంటి పుట్టగొడుగు కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగు’. మన దేశంలో దీని కిలో ధర ఎంతో తెలుసా ? రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా ఉంటుంది. రుచికి మారుపేరుగా నిలిచే గుచ్చి పుట్టగొడుగులు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తైన కొండ ప్రాంతాలలో సహజంగా పెరుగుతాయి. సముద్ర మట్టానికి 1500 నుంచి 3500 మీటర్ల ఎత్తులోనే ఇవి పెరుగుతాయట. టెంపరేచర్ 14 నుంచి 17 డిగ్రీల సెల్సీయస్ మధ్య ఉంటేనే వీటి పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయట. తేమ పరిస్థితులు ఉండే అడవులలోనూ కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగులు పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు ఎక్కువగా జంటలుగా (ఆడ, మగ కలిసి) పెరుగుతాయి. ఎంతో రిస్క్ చేసి కొండలపైకి ఎక్కి వీటిని సేకరిస్తారు. అందుకే రేటు అంత ఎక్కువగా(Kashmiri Mushrooms) ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
భారతీయ వ్యవసాయ పరిశోధనా విభాగం హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ లో ఖుంబా పుట్టగొడుగుల పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ‘కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగు’లపై ఈ కేంద్రంలో రీసెర్చ్ చేస్తున్నారు. వ్యవసాయ యోగ్యమైన పంటగా ఈ ఖరీదైన పుట్టగొడుగులను మార్చగలమా ? లేదా ? అనే దానిపై ఈ రీసెర్చ్ సెంటర్‌లో స్టడీ చేస్తున్నారు. ప్రధాని మోడీ సైతం కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగులను ఇష్టంగా తింటారట. చరిత్రలోకి వెళితే.. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా గుచ్చి పుట్టగొడుగులను ఇష్టంగా తినేవారు. అమెరికా, యూరప్, ఇటలీ దేశాల్లోనూ వీటికి మంచి డిమాండ్ ఉంది. ‘కశ్మీరీ గుచ్చి పుట్టగొడుగు’లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.