True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇలా!
ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు.
- Author : Gopichand
Date : 21-03-2025 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సమయాన్ని మీకు ఇస్తాడు. ఇది నేటి కాలంలో అత్యంత విలువైన విషయం. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఇంకా ఎలాంటి సంకేతాలు ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రతి సమస్యలో మీకు మద్దతు ఇస్తారు
ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారంటే ముందుగా మనం చేయవలసింది నా ప్రియమైన వ్యక్తి ఎవరో చూడడమే అని ప్రేమానంద్ మహరాజ్ చెబుతున్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక ముఖ్యమైన అంశం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ భావాలను పంచుకునే స్నేహితుడిని కనుగొనాలని కోరుకుంటారు. తప్పు చేసినా విడిచిపెట్టకుండా ఉండే స్వభావం ఉన్నవారిని వెతుకుతారు. ప్రతి సమస్యలో మనతో పాటు ఉండే వ్యక్తిది నిజమైన ప్రేమ అని ఆయన అంటున్నారు.
ఆనందం భాగస్వామి ఆనందంలో ఉంటుంది
ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వెంటనే కలిసిపోయే గుణం ఉంటే వారు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తేున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే భాగస్వామి ఆనందపడినప్పుడు తన కంటే ఎక్కువ సంతోష పడుతున్నాడంటే అతను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నట్లు అని అర్థం. భగస్వామి సంతోషాన్ని, దుఃఖాన్ని స్వంతంగా భావిస్తే ఆ వ్యక్తికి నిజంగా మీ మీద ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
Also Read: Champions Trophy 2025: భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ ఎలా ఉందంటే? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం.. నిజమైన ప్రేమ అనేది ఆత్మతో అనుసంధానించబడి ఉంటుంది. శరీరానికి కాదు. శరీరం, రూపం, సంపద, సామాజిక స్థితి తాత్కాలికమైనవి. కాలానుగుణంగా మారుతాయి. కానీ ఆత్మ ప్రేమ శాశ్వతమైనది. మోసం లేదా స్వార్థం లేనిదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమ మనం ఆత్మతో ప్రేమించే వ్యక్తి పట్ల మాత్రమే ఉంటుంది.