HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Life Style
  • >These Special Signs On Palm Can Reveals About Your Health Wealth Age And Married Life

Palmistry:మీరు ఎంతకాలం జీవిస్తారు ? పెళ్లి ఎప్పుడు అవుతుంది ? చేతిలోని ఈ హస్త రేఖలతో గుర్తుపట్టండి!!

జ్యోతిష్యం గ్రహాలు, నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది. కానీ హస్తసాముద్రికం అరచేతి రేఖల ఆధారంగా చెప్పబడింది.

  • By Hashtag U Published Date - 02:50 PM, Wed - 21 September 22
  • daily-hunt
Mirroar
Mirroar

జ్యోతిష్యం గ్రహాలు, నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది. కానీ హస్తసాముద్రికం అరచేతి రేఖల ఆధారంగా చెప్పబడింది. దీని గురించి అధ్యయనం చేసిన వ్యక్తులు రేఖలను చూసి భవిష్యత్తును అంచనా వేస్తారు. హస్తసాముద్రికంలో కొన్ని పంక్తులు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఉదాహరణకు జీవిత రేఖ, విధి రేఖ, సంపద రేఖ, వివాహ రేఖ, రాహు రేఖ అని శాస్త్రం తెలిసిన వారు చెబుతారు. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* వివాహ రేఖ

అందరి చేతిపై చిన్న వేలి కింద బుధుడు ఎత్తు వరకు వెళ్లే రేఖను వివాహ రేఖ అంటారు. ఇది అందరికీ ఉంటుంది.వివాహ రేఖ చిటికెన వేలికి, హార్ట్ లైన్‌కు మధ్య ఉంటుంది. ప్రధాన రేఖను ఆనుకుని చిన్న రేఖలు ఉంటే అనేక మందితో సంబంధాలు, వ్యవహారాలు లేదా నిశ్చితార్ధం జరిగిన తర్వాత రద్దు చేసుకోవడం లాంటివి సంభవిస్తాయి.వివాహ రేఖ హృదయ రేఖకు దగ్గరగా ఉన్న వారికి ఇరవయ్యో సంవత్సరంలోనే వివాహ యోగం వస్తుంది అంటున్నారు నిపుణులు. అంటే వీరికి వివాహా యోగం త్వరగా ఉంటుందని అర్థం.స్పష్టమైన వివాహ రేఖ ఉన్నవారికి వైవాహిక జీవితం మంచిది. లేకపోతే అష్టకష్టాలు పడక తప్పదు అంటారు.

* ప్రేమ రేఖ

చేతి హార్ట్‌ రేఖ వేళ్ల వైపునకు వంగి ఉంటే.. మీరు ప్రసంగంలో నిపుణుడు. ఎలాంటి తడబాటు లేకుండా ప్రేమకు తెరతీస్తారు. ప్రియమైనవారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి.చిన్న ప్రేమ రేఖ ఉంటే.. అది ఉంగరపు వేలు, మధ్య వేలు వద్ద ముగుస్తుంది. అతడు అదృష్టవంతుడు, ఎక్కువగా ఒంటరిగా ఉన్నాడని అర్థం. అతడు ప్రేమకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు. ఇంకా కొన్ని లవ్‌లైన్స్‌ ప్రేమను ప్రేరేపిస్తాయి.

అరచేతిపై ప్రేమ రేఖ విభిన్న గీతలు, ఆకారాలతో మీరు జీవితంలో లవ్‌ మ్యారేజ్‌ అవుతుందో లేదో అంచనా వేయవచ్చు. అరచేతుల్లోని ప్రేమరేఖ వేళ్లకు దిగువ దగ్గర్లో ఉంటుంది. ఇది అరచేతి అంచున వెంట నడుస్తుంది. కొన్ని చూపుడు వేలు లేదా మధ్య వేలితో ముగుస్తాయి. కొందరికి తేలికపాటి హార్ట్‌లైన్‌ ఉంటుంది. మరికొందరికి ముదురు, లోతైన ప్రేమ రేఖ ఉంటుంది. ఈ మార్పులన్నీ ఎలా ప్రేమించాలో ఎవరిని ఎప్పుడు ప్రేమించాలో? తెలుసుకునేలా చేస్తాయి.

పొడవైన ప్రేమ రేఖ అరచేతి అంచు నుంచి ఓపెనింగ్‌ వరకు విస్తరించి ఉంటుంది. పురుషులు సుదీర్ఘ ప్రేమ రేఖను కలిగి ఉంటే.. వారు చాలా రొమాంటిక్‌ అని అర్థం. సుదీర్ఘ ప్రేమ రేఖను కలిగి ఉండటం అంటే మీరు ప్రేమలో నమ్మకంగా ఉన్నారని అర్థం.మీకు చూపుడు వేలు, మధ్య వేలు మధ్య హార్ట్‌ లైన్‌ ఉంటే.. అది నిజమైన ప్రేమకు చిహ్నం.

* సంతాన రేఖ

హస్తసాముద్రిక జ్యోతిషం ప్రకారం వీటి ద్వారా మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలోని చిటికెన వేలి కింద భాగంలో బుధ గ్రహం ఉంటుంది. ఈ గ్రహం మనకు పుట్టుబోయే సంతానం గురించి తెలియజేస్తుంది. సంతాన రేఖ ఎలాంటి అడ్డంకులు లేకుండా తిన్నగా ఉంటే పుట్టబోయే పిల్లల జీవితాలు ఆటంకం లేకుండా సాగిపోతాయి. అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

చేతిలో బుధ గ్రహ రేఖ పొడుగ్గా ఉంటే ఎక్కువ మంది అంటే నలుగురు కంటే ఎక్కువ మంది పుడతారు. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువ ఉంటారట. అలాగే వీళ్లు ఉన్నత విద్యావంతులే కాకుండా సభ్యత గలవారు. ఇంద్ర గ్రహానికి చెందిన రేఖ పొడుగ్గా ఉంటే ఒక్కరు మాత్రమే పుడతారు. పుట్టే బిడ్డ సుగుణాలతోపాటు బాధ్యతయుతమైన వ్యక్తిగానూ వ్యవహరిస్తాడు.

అరచేతిలోని సంతాన రేఖ బలంగా ఉంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను పొందుతారు. అలాగే సంతాన రేఖల్లో ఒక్క రేఖ స్పష్టంగా కనబడితే పిల్లల్లోని ఒకరిని మీరు ప్రత్యేకంగా చూస్తారు. వారికి మరింత చేరువవుతారు.

భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అరచేతిలో సంతాన రేఖ లేకపోయినా పిల్లలు ఉండరని అనుకోకూడదు. భార్య లేదా భర్త అరచేతిలో సంతాన రేఖ ఉంటే ఆడపిల్లలు పుడతారు. సంతాన రేఖ విశాలంగా ఉంటే వీరికి మగ బిడ్డ పుట్టే అవకాశం ఉంది.

* ఆరోగ్య రేఖ

హృదయ రేఖ ,జీవిత రేఖ ఒకదానితో ఒకటి కలిసి ఉంటే అది చాలా అరిష్టం. అలాంటి వ్యక్తులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. చిన్న ఆరోగ్య సమస్యల పట్ల కూడా శ్రద్ధ వహించాలి.జీవితరేఖపై మచ్చలు, డాగులు, అడ్డురేఖలు, గుంటలు, లంకలు, చెడు గుర్తులు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వేదిస్తుంటాయి. అనేక రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక నష్టాలు, నిలకడలేని జీవితం, నిలకడలేని ఆదాయంతో కష్టాలు పడుతూ ఉంటారు.

కుజ స్ధానమును, శుక్ర స్ధానమును పూర్తిగా చుట్టి, స్పష్టంగా, లోతుగా, కాంతివంతంగా జీవితరేఖ ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి చురుకుదనం కలిగి మంచి ఆరోగ్యవంతుడుగా మంచి సంపాదనతో సుఖ శాంతులు అనుభవిస్తాడు.జీవితరేఖ చాలా వెడల్పుగా, మోటుగా, పాలిపోయినట్లయితే అనారోగ్యాలు తొందరగా రావు. వస్తే తొందరగా వదలవు. మనిషిని పట్టి పీడిస్తాయి. పశుసంపద బాగుంటుంది. ఆదాయం ఉండదు. కూలిపని చేసి జీవిస్తారు. తరచుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితరేఖ సన్నగా ఉంటే అనారోగ్యాలు తొందరగా వస్తాయి. తొందరగా పోతాయి.

* ధన రేఖ

మనందరి చేతుల్లో చిటికెన వేలు కింద భాగంలో నిలువ వరుసలో ధన రేఖ ఉంటుంది. ఈ రేఖ ఎవరి చేతిలోనైనా స్పష్టంగా, లోతుగా ఉంటే అలాంటి వ్యక్తులు ఇతరుల నుంచి సహాయం పొందుతారు. అంతేకాకుండా వారి పనులన్నీ సులభంగా జరుగుతాయి. భవిష్యత్తులో వీరికి ఎలాంటి డబ్బు కొరతనేది ఉండదు. అంతేకాకుండా సమాజంలో పేరు, గౌరవ మర్యాదలు సంపాదిస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

చేతిలో ధన రేఖ సరిగ్గా కనిపించకపోయినా లేదా స్పష్టంగా లేనట్లయితే అలాంటి వారికి డబ్బు అందుతుంది కానీ అది ఎక్కువ కాలం నిలువదు. ధనరేఖ స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే జీవితంలో చాలా ఆదాయ వనరులు సమకూరుతాయి. ఎవరి చేతిలోనైనా సూర్య రేఖ ఉన్నట్లయితే వారు గొప్ప ధనవంతులవుతారని నమ్మకం.

చేతిలో ధనరేఖ మధ్యలోనే ఆగిపోయిన లేదా వంగి పోయి ఉన్నట్లయితే డబ్బు విషయంలో మీరు అదృష్టవంతులు కాదని తెలుసుకోవాలి. కెరీర్, వ్యాపారంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

* ఆయుష్షు రేఖ

చేతిలో ఐదు ప్రాథమిక రేఖల్లో ఒక్కో రేఖ భవిష్యత్తులో ఒక్కో లక్షణాన్ని తెలియజేస్తుంది. పరిమాణం, ప్రాముఖ్యత, వక్రాన్ని బట్టి వీటిని విశ్లేషిస్తారు.ప్రతి ఒక్కరి చేతిలోనూ ప్రధానంగా మూడు రేఖలు ఉంటాయి. వీటిలో ఒకటి ఆయుష్షు, శిరస్సు, వైవాహిక జీవితానికి సంబంధించింది. చూపుడు వేలు పక్క నుంచి బొటనవేలు కిందికు ప్రయాణించేది ఆయుష్షు రేఖ (జీవనరేఖ).

ఇది చూపుడు వేలు నుంచి ప్రారంభమై చేతి మణికట్టు వరకు సాగుతుంది. దీని పొడవు తక్కువగా ఉంటే అల్పాయుష్షు, ఎక్కువుంటే దీర్ఘాయుష్షు. ఈ రేఖ మధ్యలో అవాంతరాలు ఏర్పడితే ప్రతికూలతలు ఎదుర్కొంటారు.

కానీ దానికి సమాంతరంగా వేరే రేఖ వెళితే దాని ప్రతికూలత ప్రభావం ఉంటుంది. ఆయుష్షు రేఖ పొడుగ్గానూ, విశాలంగానూ, బలంగానూ ఉండేవాళ్లు జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సమర్థంగా పరిష్కారించుకుంటారు. దీంతో ఆ వ్యక్తి ఆరోగ్యంగానూ, సంతోషంగానూ జీవిస్తారు.

శిరస్సు, జీవన రేఖ ఓకే దగ్గర ప్రారంభమయ్యే వ్యక్తులు స్వతంత్ర భావాలతోపాటు ఏ విషయానైనా అంగీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చేతిలో ఆయు, శిరస్సు రేఖల మధ్య దూరం ఎక్కువుంటే ఆ వ్యక్తులు బాధ్యత రహితంగా ఉంటారు. వీళ్లు సమస్యల బారినపడే అవకాశం ఉంది.

రెండు అర చేతుల్లోని అయుష్షు రేఖలో అవాంతరాలు ఏర్పడితే అకాల మరణం లేదా ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతారు. ఒక చేతిలో సాధారణంగా ఉండి, మరో చేతి రేఖలో అవాంతరం ఉండే దీర్ఘకాలిక రోగాల బారిన పడతారట. ఇది మరణానికి దారి తీస్తుందట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • Palmistry
  • special signs on palm
  • wealth
  • wedding

Related News

Neymar

Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Viral : ప్రపంచ ఫుట్‌బాల్‌ స్టార్ నెయ్‌మర్‌కి సంభందించిన ఒక సంచలనాత్మక వార్త బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల వయసులోనే మరణించిన అనామక బిలియనీర్‌ తన వీరునామా (Will) ద్వారా మొత్తం ఆస్తిని నెయ్‌మర్‌కి రాసిచ్చేసినట్లు తెలుస్తోంది.

    Latest News

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd