HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Natural Packs Helps To Hydrate Your Hair During Winter Season

Winter Hair Care: పొడిబారిన జుట్టు ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?

శీతాకాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పొడిజుట్టు. చల్లటి గాలులు, తేమ పొగ మంచు వంటి వాటి వల్ల జుట్టు పొడిబారుతూ ఉంటుంది. దాంతో జుట్టు ని

  • Author : Anshu Date : 09-02-2024 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 09 Feb 2024 07 19 Pm 9094
Mixcollage 09 Feb 2024 07 19 Pm 9094

శీతాకాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పొడిజుట్టు. చల్లటి గాలులు, తేమ పొగ మంచు వంటి వాటి వల్ల జుట్టు పొడిబారుతూ ఉంటుంది. దాంతో జుట్టు నిర్జీవంగా మారడం, చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురువుతాయి. సహజసిద్ధంగానే పొడితత్వం ఉండే జుట్టు ఉన్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని నేచురల్ ప్యాక్స్ ట్రై చేస్తే చాలు. పట్టు లాంటి ఒత్తైన దృడమైన జుట్టు మీ సొంతం. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. మీ జుట్టు పొడిబారితే బాగా పండిన ఒక అరటిపండు తీసుకొని దానిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకొని కండిషనర్ రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

మరొక రెమిడీ విషయానికి వస్తే.. గుడ్డులోని తెల్ల సొనకు రెండు చెంచాల చొప్పున శనగపిండి, బాదం పొడి, తగినంత గులాబీనీరు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట ఆగి, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది. అదేవిధంగా గుమ్మడికాయ మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. గుమ్మడికాయలోని విటమిన్‌ ఎ, సిలతో పాటు బీటాకెరోటిన్, జింక్, పొటాషియం మీ జుట్టును హెల్తీగా ఉంచుతాయి. కొద్దిగా గుమ్మడికాయ పేస్ట్ తీసుకొని అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసి మంచి కండిషనర్ అప్త్లె చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా కురులు మృదువుగా, పట్టులా మారతాయి.

జుట్టు పొడిబారకుండా ఉండాలి అంటే రెండు చెంచాల మెంతిపిండికి నాలుగు చెంచాల కొబ్బరిపాలను కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని మాడుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. గంట తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. గంజిలో బి, ఇ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణనిచ్చి ఆరోగ్యంగా మారుస్తాయి. గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట ఆరనివ్వాలి. ఆపై తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కుదుళ్లు బలపడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair care
  • hair tips
  • natural packs
  • winter
  • Winter Hair Care
  • winter season

Related News

If you want radiant skin and thick hair, you simply must use that oil!

Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

మామూలుగా ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం అలాగే ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్టులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు లభించలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామంది చర్మం అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd