HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Items Should Not Be Kept In The Kitchen

Kitchen Tips : వంటింట్లో ఈ వస్తువులు ఉంచకూడదు..

ఇంట్లో వారి ఆరోగ్యం (Health) కోసం చక్కని రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం తయారవుతుంది. కానీ ఎప్పుడూ ఎవరో

  • Author : Maheswara Rao Nadella Date : 28-12-2022 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kitchen Tips And Hacks
Kitchen Tips And Hacks

వంటిల్లంటే (Kitchen) అన్నపూర్ణ దేవి ఆవాసం. ఇంట్లో పూజ గదిని ఎంత శుభ్రంగా శుచిగా పవిత్రంగా ఉంచుకుంటామో.. వంటింటిని కూడా అలాగే పెట్టుకోవాలి. కొంత మంది ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు సాధించలేరు. ఇంట్లో వారి ఆరోగ్యం కోసం చక్కని రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం తయారవుతుంది. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు. వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు.

వంటింట్లో (Kitchen) పెట్టుకోకూడని వస్తువులు:

చీపురు పెట్టొద్దు: చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వంటగది సహా ఇల్లంతటిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దానిని ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంచుకోకూడదు. అలా ఉంచితే అశుభం. వంటగదిలో చీపురు ఉంచితే ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయట. అన్నపూర్ణా దేవి అలుగుతుందని కూడా వాస్తు చెబుతోంది. ఇంట్లో ధాన్యం నిలువలు కూడా తగ్గిపోతాయి.

మందులు ఉంచొద్దు: వంటింట్లో అందరి ఆయురారోగ్యాల కోసం ఆహారం తయారవుతుంది. అక్కడ పొరపాటున కూడా మందులు ఉంచకూడదు. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా కష్టాలు, అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరు వాడే మందులైనా సరే వంట గదిలో కాకుండా మరెక్కడైనా పెట్టుకోవాలి.

అద్దం వద్దు: వంటింట్లో అద్దం ఉండకూడదు. వంట గదిలో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబం ఏర్పడుతుంది. అందువల్ల అద్దంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటికి చాలా హానికరం. వంటగదిలో అద్దం ఉంటే కష్టాలు ఎన్నటికీ తీరవని వాస్తు చెబుతోంది.

పాడైన వస్తువులు ఉంచొద్దు: చాలామందికి వంటింట్లో వాడే వంట పాత్రలు లేదా ఇతర వస్తువులు పాడైపోయినా, విరిగి పోయానా, రంథ్రాలు పడినా సరే వాటిని పారెయ్యడానికి ఇష్టపడరు. కానీ వాస్తు ఇలా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. వంటగదిలో పాడైపోయిన వస్తువులు, పనికిరాని పాత్రల వంటి వ్యర్థాలు ఉంచుకోకూడదు. ఇది అన్నపూర్ణ దేవికి చేసే అవమానంగా భావించాల్సి ఉంటుంది. కనుక వంటింట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా తీసెయ్యాలి.

ఇవి వంటింట్లో తప్పక ఉండాలి:

⦿ కొన్ని వస్తువులు వంటింట్లో నిండుకోకుండా కూడా చూసుకోవాలి. కొన్ని వస్తువులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూదని వాస్తు చెబుతోంది. ఆ పదార్థాలు లేదా వస్తువులు అయిపోవడానికి ముందే తెచ్చి ఇంట్లో నిలవ ఉంచుకోవాలి.

⦿ వంటింట్లో ఉప్పు ఎల్లప్పుడు ఉండాలి. సముద్రం నుంచి పుట్టిన ఉప్పు లక్ష్మీకి సోదర సమానం. అంతేకాదు ఉప్పు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. వాస్తు దోషాలకు కూడా పరిహారంగా ఉంటుంది. రాహు, కేతు ప్రభావాలను నివారిస్తుంది. కాబట్టి ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి.

⦿ పసుపు చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ప్రతి వంటలోనూ చిటికెడైనా పసుపు వాడాలి. పసుపు గురు గ్రహానికి ప్రతీక. ఇంట్లో పసుపు నిండుకుంటే గురు గ్రహదోషం కలుగుతుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి.

⦿ బియ్యం ప్రధాన ఆహార ధాన్యం మనకు. ఇది ధాన్య లక్ష్మికి ప్రతీక. శుక్ర గ్రహానికి ప్రతీక. వంటగదిలో బియ్యం నిండుకోవడం అంటే అందుకు శుక్రుడి దోషం అని భావిస్తారు. బియ్యం నిండుకోవడం అంటే డబ్బుకు కొరతగా భావించాలి. అందుకే వంటింట్లో బియ్యం నిండుకోకుండా చూసుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Hacks
  • health
  • Kitchen
  • Life Style
  • tips

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd