Summer Face Pack : ఎండాకాలంలో మన చర్మానికి ఏ ఫేస్ ప్యాక్ లు వాడితే మంచిదో తెలుసా?
ఎండాకాలంలో మన చర్మానికి ఏ ఫేస్ ప్యాక్ లు వాడితే మంచిదో తెలుసా?
- By News Desk Published Date - 06:00 AM, Tue - 23 April 24

Summer Face Pack : ఎండాకాలం రాగానే మనం హెల్త్, మన శరీరంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం. ముఖ్యంగా ఎండలకు మన చర్మం ఎక్కువగా ట్యాన్ అవుతుంది. దీంతో చిరాకుగా ఉంటుంది. అయితే చర్మం పాడవకుండా ఎంతో అందంగా ఉండడానికి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను ట్రై చేయొచ్చు.
హానీ యోగర్ట్ మాస్క్.. ఒక స్పూన్ తేనెలో ఒక స్పూన్ పెరుగు కలపాలి. దానిని ముఖం, మెడ, చేతులకు రాసి ఒక పావుగంట తరువాత చల్లని నీటితో కడగాలి.
వాటర్ మిలన్ మాస్క్.. ఒక అరకప్పు పుచ్చకాయ ముక్కలను తీసుకొని వాటిని మెత్తగా చిదమాలి. ఆ గుజ్జును ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఒక పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి.
కోకోనట్ ఆయిల్ టర్మరిక్ మాస్క్.. ఒక స్పూన్ కొబ్బరినూనెలో అరస్పూన్ పసుపు కలిపి ముఖం, పాదాలు, చేతులకు పట్టించాలి. కొద్దిగా ఆరిన తరువాత దానిని మర్దనా చేసుకుంటూ చల్లని నీటితో కడగాలి. నూనెగా ఉంటె టిష్యూతో తుడుచుకోవాలి.
పపయా హానీ మాస్క్.. పండిన బొప్పాయి ముక్కలు అరకప్పు తీసుకొని దానిలో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఆ గుజ్జును ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి పావుగంట తరువాత చల్లని నీటితో కడగాలి.
మింట్ కుకుంబర్ మాస్క్.. కీరదోసకాయ ముక్కలు అరకప్పు తీసుకొని వాటిని మిక్సి పట్టాలి దానిలో కొద్దిగా పుదీనా కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి అప్పుడు వచ్చిన గుజ్జును మన ముఖానికి, పాదాలకు, చేతులకు రాయాలి. ఒక పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి.
ఇలా ఎండాకాలంలో ఇలాంటి మాస్క్ లను వాడడం వలన మన చర్మాన్ని ఎండ నుండి రక్షించుకోవచ్చు. ఎండాకాలంలో కూడా అందంగా ఉండొచ్చు.
Also Read : Keera Dosakaya Raitha : ఎండాకాలంలో కీరదోసకాయ పెరుగు పచ్చడి.. ఎలా చేయాలంటే.. హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసా?