Face Oils : నల్లటి మచ్చలు తగ్గి ముఖం మెరవాలంటే ఈ ఆయిల్స్ తో మసాజ్ చేయండి?
మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత లేదంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ముఖంపై మొటిమలు వచ్చి ఆ తర్వాత అవి అలాగే నల్లటి మచ్చలుగా మ
- By Nakshatra Published Date - 09:45 PM, Sun - 27 August 23
మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత లేదంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ముఖంపై మొటిమలు వచ్చి ఆ తర్వాత అవి అలాగే నల్లటి మచ్చలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఈ నల్లని మచ్చలను పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. హోమ్ రెమిడీలను బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించినప్పటికీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. అయితే మరి కొన్ని రకాల ఆయిల్స్ ని ఉపయోగించి ఆ నల్లటి మచ్చలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జోజోబా ఆయిల్.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, గాయాన్ని నయం చేసే సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి దీనిని తరచుగా వాడడం వల్ల చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా చర్మానికి చాలా మంచిది. దీనిని ముఖానికి, తలకి అప్లై చేయడం మంచిది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా ఉంటాయి. అదేవిధంగా బాదం నూనెలో విటమిన్ ఇ, జింక్, ప్రోటీన్స్, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే చాలా మంచిది.
అలాగే షియా బటర్ మాంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. షియా బటర్, ఆలివ్ ఆయిల్ కలపి అప్లై చేస్తే చాలా మంచిది. ఆముదం.. చూడ్డానికి చాలా జిడ్డుగా ఉంటుంది. కానీ, ఇందులోని గొప్ప గుణాలు చర్మానికి మాయిశ్చరైజేషన్ అందించి హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా చర్మంపై మ్యాజిక్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనె అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. ఈ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఇ, కెలు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
Related News
Glowing Skin: ముఖంపై మచ్చలు తగ్గాలి అంటే టమోటాతో ఇలా చేయాల్సిందే?
టమోటాల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.