Skin Beauty: శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా…?
చలికాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోరు. బాహ్య చర్మ సంరక్షణ చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ అనేది చాలా కీలకం.
- By Hashtag U Published Date - 11:23 AM, Thu - 27 January 22
చలికాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోరు. బాహ్య చర్మ సంరక్షణ చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే చాలా వరకు నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో…బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. చలికాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం పొడిబారిపోవడం. దురద రావడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంత వరకు మృదువుగా తేమగా ఉంచుకోవడం మంచిది. సహజసిద్ధంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా మెరిసిపోయేలా ఉంచుకోవడమెలాగో ఇప్పుడు తెలసుకుందాం.
నిమ్మకాయలో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు మినరల్స్ అనేవి ఆరోగ్యానికి చాలా విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిమ్మలో సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. మాస్క్ ల రూపంలో నిమ్మను ఉపయోగించినట్లయితే మీ చర్మం యవ్వనంగా మరింత అందంగా కనిపిస్తుంది.
సిట్రిక్ ఫ్రూట్స్ కోవలోనిదే నిమ్మ..
స్కిన్ ట్యాన్, బ్లేమిషెష్, ఆన్ ఈవెన్ స్కిన్ టోన్ వంటి కొన్ని సమస్యలు సాధారణంగా చాలామందిలో ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మ తోడ్పడుతుంది. సిట్రిక్ ఫ్రూట్స్ కోవలోకి చెందే నిమ్మ వేసవి కాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ సారి మీరు నిమ్మకాయను కొన్నప్పుడు నిమ్మకాయ ద్వారా లభించే సౌందర్య ప్రయోజనాలను ద్రుష్టిలోఉంచుకుని కొన్నింటిని చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడం కోసం ఉపయోగించండి.
ఒక కొంత నిమ్మను తీసుకుని గ్రైండ్ చేసి అందులో తేనెన కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిని ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోండి. ఇలా వారానికి రెండు సార్లు పాటించినట్లయితే మెరుగైన ఫలితాలను పొందుతారు.
Related News
Neem Leaves : వేప ఆకులను తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు..!
భూమిపై ఉన్న అత్యంత ఔషధ మొక్కలలో వేప చెట్టు ఒకటి. వేప గింజలు శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి , పేగు పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు.