Relationship : భాగస్వామి విడిపోయేందుకు రెడీగా ఉన్నారని చెప్పే 9 సంకేతాలు..!
Relationship రిలేషన్ షిప్ లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. దానికి ఇద్దరు కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి
- By Ramesh Published Date - 08:41 PM, Wed - 1 November 23

Relationship రిలేషన్ షిప్ లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. దానికి ఇద్దరు కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదంటే తప్పు నీదంటే నీదంటూ గొడవ మొదలవుతుంది. దాని వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భాగస్వామితో విడిపోయేందుకు రెడీగా ఉన్నరని చెప్పే 9 సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
We’re now on WhatsApp : Click to Join
1. వారితో గడిపే సమయం ఇబ్బందికరంగా ఉండటం
మీతో భాగస్వామి ఇబ్బందికరంగా గడుపుతున్నాడు అంటే అతను మీ మీద అయిష్టంగా ఉన్నారని అర్ధం. అలాంటి టైం లో మీతో పర్సన్ మాత్రమే ఉంటాడు అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. వారితో గడిపే సమయం ఇబ్బందికరంగా మారుతుంటే వారు మీకు దూరం అవుతున్నట్టే లెక్క.
2.తరచు చిరాకు పడటం
భగాస్వామి తరచు చిరాకు పడటం కూడా అతను మీకు దూరం అవుతున్నాడనే చెప్పొచ్చు. ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా తరచు గొడవ పడటం అనేది అంత మంచిది కాదు. దాని వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి.
3. కలిసి ఆనందంగా ఉండలేరు
ఎప్పుడు కలిసి ఉన్నా వారితో గడిపే సమయం ఆనందంగా లేకపోతే ఆ రిలేషన్ షిప్ కొనసాగించడం దండగ. వారు మీరు ఇద్దరు కలిసి ఉన్నా సంతోషంగా లేకపోతే దానికి కారణాలు విశ్లేషించుకోవాలి. అయితే తరచు ఇలా జరుగుతుంటే మీ భాగస్వామి మీకు దూరం అవుతున్నాడని గుర్తించాలి.
4. వేరు వేరు ఇష్టాలు కలిగి ఉండటం
ఒకప్పుడు మీ ఇష్టాలే తన ఇష్టాలుగా ఉన్న అతను వేరు వేరు ఇష్టాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది. దీని వల్ల మళ్లీ అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టాలు వేరైనప్పుడు అభిప్రాయ వేరుగా ఉంటాయి. అందువల్ల విబేధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : Relationship : ఈ 9 విషయాలు జరిగితే.. మీ బోయ్ ఫ్రెండ్ కి దూరమవడం మంచింది..!
5. వేరే వాళ్లకు ఎట్రాక్ట్ అవడం
రిలేషన్ షిప్ లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంటే మీరు లేదా అవతల వ్యక్తి మిగతా వారికి ఎట్రాక్ అవుతున్నారని అర్ధం. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
6. ప్రతిదానికి గొడవ పడటం
ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడటం అనేది అయిష్టతని చూపిస్తుంది. మీ బహగస్వామి మీతో ఎప్పుడు గొడవ పడతున్నాడు అంటే అతను మీకు దూరం కావాలని అనుకుంటున్నాడని గుర్తించాలి.
7. ఆర్ధిక ఇబ్బందులు రావడం
అనుకోని ఆర్ధిక ఇబ్బందులు కూడా వ్యక్తుల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీస్తాయి. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందులతో కూడా భాగస్వామి అయిష్టంతని చూపించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా అతను మిమ్మల్ని దూరం చేస్తున్నాడని గమనించాలి.
8. సన్నిహితంగా ఉండలేరు
ఒకప్పుడు చిలుక గోరింకలుగా కలిసి ఉన్న మీరు ఇప్పుడు కనీసం సన్నిహితంగా ఉండలేని పరిస్థితి వచ్చింది అంటే మీ మధ్య ఏదో జరుగుతున్నట్టే గుర్తించాలి. భాగస్వామిలో ఫిజికల్ రిలేషన్ షిప్ లేకపోతే అతను మీకు దూరం అవడానికి రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు.
9. మీ ఆలోచనలు పట్టించుకోరు
మీకు దూరం అవుదామని అనుకున్న వారికి మీ ఆలోచనలు మీ ధ్యాస అసలు ఉండదు. మీరు ఏం చేస్తున్నారన్నది కూడా అసలు పట్టించుకోరు. మీకు ఏదైనా అద్భుతమైన ఆలోచన వచ్చినా సరే వాటిని అసలు పట్టించుకోకుండా ఉంటారు. సో అలాంటి వారు మీ నుంచి దూరంగా వెళ్లేందుకు రెడెగా ఉన్నారని అర్ధం.